టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్( NTR ) ఒకరు.ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర( Devara ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే మొదటి భాగం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాతో పాటు తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలు అనుకుంటున్నారు.ప్రస్తుతం ఈయన బాలీవుడ్ చిత్రం వార్ 2( War 2 ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel )దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.నిజానికి ఈ సినిమా ఈపాటికి షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.
తాతగా ప్రశాంత్ ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రశాంత్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి షూటింగ్ పనులు జరుపుకోనున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా ఈ సినిమాని మరింత గ్రాండ్ గా డిజైన్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అధికారికంగా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.