ఏపీలో బిజెపి( AP BJP ) ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.ప్రస్తుతం టిడిపి, జనసేన పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.
అయితే ప్రధానంగా ఎన్నికల ప్రచారం అంతా.టిడిపి, జనసేనలే అన్నట్టుగా ఉండడం, బిజెపి అంతంతమాత్రంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండడం వంటివి బిజెపి తీరుపై అనేక అనుమానాలు రేకెత్తిస్తూ వస్తున్నాయి.
బిజెపి ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు నిర్ణయించుకుంది. ముఖ్యంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.205 మండలాల్లో రెండేసి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను( Street Corner Meetings ) ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది.మొత్తం 500 కు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహణకు సంబంధించి ఇన్చార్జిగా బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డిని( Vishnuvardhan Reddy ) నియమించారు.కేంద్ర ప్రభుత్వ పాలన, ప్రజలకు సంబంధించిన సంక్షేమం, క్షేత్రస్థాయిలో నిర్వహించే సమావేశాల్లో విష్ణువర్ధన్ రెడ్డి వాటిని ప్రజలకు వివరించనున్నారు.ప్రతి బూత్ స్థాయిలో 20 మంది కార్యకర్తలను గుర్తించి, వారితో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఏపీలో ఎన్డీఏ గెలుపు దిశగా అనేక ప్రణాళికలను రూపొందించారు.
ఇప్పటికే కొన్ని జిల్లాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలతో( TDP Janasena ) కలిసి బిజెపి పోటీ చేస్తున్న నేపథ్యంలో, మూడు పార్టీల నేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించే ఏర్పాట్లు చేశారు.

నిన్ననే మూడు పార్టీలకు చెందిన నేతలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఎన్డీఏ హామీల్లో ముఖ్యమైన హామీలను ఒకసారి పరిశీలిస్తే .20 లక్షల మంది యువతకు ఉపాధి , మెగా డీఎస్సీ( Mega DSC ) మీద తొలి సంతకం , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 చొప్పున ఏడాదికి 18 అందజేత, నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా , తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలు ఒక్కొక్కరికి ఏడాదికి 15000 చొప్పున ఆర్థిక సాయం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిసి సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో ఒకటి పాయింట్ 50 లక్షల కోట్ల ఖర్చు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు బీసీ కార్పొరేషన్ ను ఆర్థికంగా బలోపేతం చేయడం, బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి పదివేల కోట్లతో ఆధునిక పనిముట్ల తో ఆదరణ పథకం అమలు, పవర్ లూమ్ , హ్యాండ్ లూమ్ లకు కొంతమేర ఉచిత విద్యుత్ ,డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కల పథకం, వడ్డీ లేని రుణాలు వంటివి ఇప్పటికే ప్రకటించారు.