రాజన్న సిరిసిల్ల జిల్లా : 1886 మే 1న అమెరికా చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిసి ఎత్తిపట్టిన ఎర్రజెండా ప్రపంచ శ్రామిక వర్గ విముక్తి బావుటగా నిలిచిందని నాటి స్ఫూర్తితో మతోన్మాద కార్పోరేట్ శక్తులను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే కార్మిక వర్గ కర్తవ్యమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.
బుధవారం బి వై నగర్ లో పార్టీ కార్యాలయం ఎదుట సిపిఎం అరుణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టజీవులందరికీ మేడే పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నేటి 8 పనిగంటల విధానం రావడానికి కార్మికులు తమ రక్తంతో తడిసిన జెండాను ఎత్తి పట్టడమే మూల కారణమన్నారు.
ప్రపంచ కార్మిక వర్గమే తమ విముక్తికి ఎర్రజెండా మార్గమని గుర్తించారన్నారు కష్టజీవులే సృష్టించుకున్న జెండా ఎర్రజెండా అని కొనియాడారు.
నాటి నుంచి నేటి వరకు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి సర్కార్ అద్దు చేసిందన్నారు.నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచి పెట్టిందన్నారు.
దీంతో కార్మికుల పొట్టలు కొడుతుందని విమర్శించారు.పవర్లూమ్ పరిశ్రమ పైన జిఎస్టి వేయొద్దంటూ కార్మిక వర్గం మొరపెట్టుకున్న బిజెపి సర్కార్ కక్ష సాధింపుతో కార్మిక వర్గంపై జీఎస్టీ పెనుబారం మోపిందన్నారు.
పవర్లూమ్ కార్మికుల ఆత్మహత్యలకు కేంద్ర బిజెపి సర్కార్ విధానాలే కారణమైందన్నారు.కార్మిక వర్గం కుల మతాలకతీతంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా తమ హక్కులు సాధించుకోవాలన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మతోన్మాద బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.బిజెపి విధానాలు నియంతృత్వం వైపు అడుగులేస్తున్నాయని, మూడోసారి అధికారంలోకి వస్తే కార్మిక జీవితాలు మరింత దుర్భరం కానున్నాయని తెలిపారు.
రాజ్యాంగం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసే ప్రమాదం ఉందని అన్నారు.ఎన్నటికైనా ఎర్రజెండానే కార్మికుల విముక్తి బావుటా అని పేర్కొన్నారు.ఎర్రజెండాను కంటికి రెప్పలా ఇంటి ఆడబిడ్డలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, ఆ పార్టీ సీనియర్ నాయకులు మిట్టపల్లి రాజమల్లు, పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ ,పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ, కల్పన,వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిమల సత్యం, ఉడత రవి, కంది మల్లేశం, బెజిగం సురేష్, సందుపట్ల పోచమల్లు,మచ్చ వేణు తదితరులు పాల్గొన్నారు.







