కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అజిత్( Ajith ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక అజిత్ హీరోయిన్ శాలిని( Shalini ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక అజిత్ సినిమాలు ఎంతో ఇష్టపడతారు అయితే ఈయన సినిమాల తర్వాత ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది బైక్ రైడింగ్( Bike Riding ) అని మాత్రమే చెప్పాలి.
ఈయన బైక్ రైడ్ చేస్తూ ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు.ఇలా బైక్ రైడింగ్ అంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి అజిత్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు 53వ పుట్టినరోజు( Ajith Birthday ) వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఆయన భార్య శాలిని ఊహించిన విధంగా అజిత్ కి బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ సంతోషపెట్టారు.మరి అజిత్ పుట్టినరోజు సందర్భంగా శాలిని ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అనే విషయానికి వస్తే.
బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి అజిత్ కోసం శాలిని ప్రత్యేకంగా ఖరీదైన Ducati బైక్‌ను బహుమతిగా అందజేసింది.దీనికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా తన భర్తకు ఊహించని విధంగా తనకు ఎంతో ఇష్టమైనటువంటి బహుమతి అందజేస్తూ శాలిని సర్ప్రైజ్ చేశారు.
ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.ఏకే 62గా వస్తున్న విదా ముయర్చి( Vidaa Muyarchi ) సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు
.