నా చర్మం వలిచి చెప్పులు కుట్టించి .. కోమటిరెడ్డి ఎమోషనల్ కామెంట్స్ 

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkatreddy ) ఎమోషనల్ కామెంట్స్ చేశారు.నల్గొండ నియోజకవర్గ( Nalgonda Constituency ) కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వెంకటరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

 Minister Komatireddy Venkatreddy Emotional Comments At Nalgonda Congress Party M-TeluguStop.com

గల్లి నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం బలిసి చెప్పులు కుట్టించినా తక్కువే.కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాల నైనా ఇస్తా.

నాకు కొడుకు లేడు.మీరే నా వారసులు, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నా సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించినా, సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను చేసుకొస్తా .భారీ మెజార్టీ మీరు ఇవ్వండి.

Telugu Congress, Komati Venkata, Komati Venkat, Pcc, Telangana-Politics

కాబోయే ఎంపీ రఘువీర్ తో కలిసి సర్పంచ్ ఎన్నికల్లో మీకోసం పనిచేస్థాం.పేద పిల్లల చదువు బాధ్యత ప్రతీక్ ఫౌండేషన్ తీసుకుంటుంది ” అంటూ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.ఇక ఈ సమావేశంలోనే బిఆర్ఎస్ పార్టీపై( BRS ) కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణలో నీటి కరువుకు కారణం బీఆర్ఎస్ పార్టీనే అని విమర్శించారు.2004లో 33 కిలోమీటర్ల ఎల్.ఎల్.బి.సి పూర్తి చేస్తే కెసిఆర్( KCR ) ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.మూడేళ్లలో ఎల్.

ఎల్.బి.సి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Telugu Congress, Komati Venkata, Komati Venkat, Pcc, Telangana-Politics

ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో 200 ఎకరాల్లో పదివేల ఇళ్లు కడతామని హామీ ఇచ్చారు.కేటీఆర్,  కెసిఆర్ మానసిక పరిస్థితి దిగజారిపోయిందని వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసి నదిలో వేసినట్లేనని సెటైర్లు వేశారు.దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని , రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని అవుతారని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్ధమే అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు ప్రజల్లోకి  వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube