తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) సవాల్ విసిరారు.తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు.
ప్రెస్ క్లబ్ కు వస్తారా? లేక అమరుల స్థూపం వద్దకు వస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.లేదంటే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వస్తారా అని నిలదీశారు.
గాడిద గుడ్లు నెత్తిపైన పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నోటు దురుసు అందరికీ తెలుసని చెప్పారు.రిజర్వేషన్లు( Reservations ) రద్దు చేస్తారంటూ కాంగ్రెస్( Congress ) ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని ఆరోపించారు.బీజేపీకి మద్ధతు పెరగడంతో తట్టుకోలేక వీడియోల మార్పింగ్ అని ధ్వజమెత్తారు.