ఏలూరులో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికలు కులాల మధ్య యుద్ధం కాదని.క్లాస్ వార్( Class War ) అని తెలిపారు.
పేదలు ఒకవైపు ఉన్నారు.పెత్తందారులు ఓ వైపు ఉన్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.ఈ క్రమంలో వైసీపీ( YCP ) పేదల పక్షాన నిలబడిందని చెప్పారు.రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందన్న సీఎం జగన్ ఈ ఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు( Chandrababu ) మధ్య జరుగుతున్నవి కాదని చెప్పారు.
పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు.జగన్ కు ఓటు వేస్తేనే అన్ని పథకాలు కొనసాగుతాయన్నారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలికినట్లేనని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టేనని తెలిపారు.
జగన్ పేదలు అని మాట్లాడితే.చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు కోపం వస్తోందని విమర్శించారు.







