సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్య

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) నివాసం వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు కస్టడీలో ఉన్న నిందితుడు అనూజ్ తపన్( Anuj Thapan ) జైలులోని తన బ్యారక్ లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

 Suspect Died In Shooting Case At Salman Khan House Details, Salman Khan, Bollywo-TeluguStop.com

ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అనూజ్ తపన్ ను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్దారించారని తెలుస్తోంది.అయితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో( Bandra ) ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు నిర్వహించిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్ లకు మృతుడు అనూజ్ ఆయుధాలు అందించాడని ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఏప్రిల్ 26న అనూజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా అనూజ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube