కడప ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రినవుతా  ..ఇంకా షర్మిల ఏమన్నారంటే ..?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కడప( Kadapa ) నుంచి ఎంపీగా విజయం సాధిస్తాననే ధీమాలో ఉన్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తన అన్న జగన్ ను,( Jagan )  కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి లను( YS Avinash Reddy ) టార్గెట్ చేసుకుని సంచలన విమర్శలు చేస్తున్న షర్మిల,  కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

 Will Become Central Minister If Win As Kadapa Mp Ap Pcc Chief Ys Sharmila Commen-TeluguStop.com

తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానంటూ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అంతే కాదు ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు .కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.  వైయస్సార్ కు జగన్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు.

  వైఎస్ఆర్ ఆశయాలను ఒకటైన జగన్ అమలు చేశాదా అని ప్రశ్నించారు.

Telugu Aicc, Ap Cm Jagan, Ap Congress, Cmjagan, Congress, Jagan, Kadapa, Pcc, Ys

అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు .‘ వైఎస్ఆర్( YSR ) హయాంలో వ్యవసాయం పండగ , నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడు.పంట నష్ట పరిహారం అని మోసం చేశాడు.

ధరల స్థిరీకరణ నిధి అని చీట్ చేశాడు.  నిరుద్యోగ బిడ్డలను వంచనకు గురిచేశాడు.  2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి అధికారం అనుభవించి,  ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.ఇవాల్టికి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.నేను వైఎస్ఆర్ బిడ్డ పులిబిడ్డ.నా గుండెల్లో దమ్ముంది.న్యాయం కోసం ఎంపీ.గా పోటీ చేస్తున్నా,  మళ్లీ నిందితుడికి ఎంపీ సీటు ఇవ్వడం అన్యాయం.

  మీరు న్యాయం వైపు ఉంటారా అన్యాయవైపు ఉంటారో కడప గడ్డ ప్రజలు ఆలోచన చేయాలి .

Telugu Aicc, Ap Cm Jagan, Ap Congress, Cmjagan, Congress, Jagan, Kadapa, Pcc, Ys

నేను పుట్టింది ఇక్కడే.  .ఇదే నా గడ్డ ఇక ఇక్కడే ఉంటా , ప్రజాసేవ చేస్తా,  అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.కడప ఎంపీగా అప్పట్లో వైఎస్సార్ పనిచేశారు.వైఎస్ వివేకా కూడా ఎంపీగా గెలిచారు.

ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీకి దిగింది.వైఎస్ వివేకానంద ను హత్య చేయించిన వ్యక్తి .హత్య జరిగిన సమయంలో మాకు విషయం తెలియదు .సిబిఐ ఆధారాలు చూపించిన తరువాత నమ్మాల్సి వచ్చింది.అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశాడనే చెబుతున్నాయి అంటూ షర్మిల విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube