గురుపత్వంత్ హత్యపై అంతర్జాతీయ మీడియాలో కథనం.. స్పందించిన అమెరికా

ఖలిస్తాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను( Gurpatwant Singh Pannun ) అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా అగ్రరాజ్యం ఆరోపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పన్నూ వ్యవహారం తెరపైకి రావడం ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారులలో ఆగ్రహానికి కారణమైంది.

 Regularly Working With India In Probe On Alleged Plot To Kill Sikh Separatist Le-TeluguStop.com

పన్నూన్‌ను అమెరికా( America ) గడ్డపై చంపడానికి జరిగిన కుట్ర వెనుక బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి తమ దేశం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని బైడెన్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది.అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగివున్న పన్నూన్‌ను హత్య చేయడానికి యత్నించిన కుట్రలో పాల్గొన్నందుకు గాను భారత జాతీయుడు నిఖిల్ గుప్తాపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గతేడాది నవంబర్‌లో అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

Telugu Gurpatwant, Gurpatwantsingh, India, Indian, Khalistan, Raw, Sikh Separati

తాజాగా అమెరికాకు చెందిన దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్( Washington Post ) పన్నూ వ్యవహారంపై కథనాన్ని ప్రచురించింది.అందులో గురుపత్వంత్ హత్యకు జరిగిన కుట్ర వెనుక భారత గూడచార సంస్థ ‘రా’కు చెందిన ఓ అధికారి( RAW Officer ) ప్రమేయం వుందని ఆరోపించడం వివాదాస్పదమైంది.దీనిపై భారత ప్రభుత్వం( Indian Govt ) ఆగ్రహం వ్యక్తం చేసింది.సున్నితమైన ఈ అంశంపై వాషింగ్టన్ పోస్ట్ నిరాధారమైన అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడింది.అమెరికా ప్రభుత్వం అందించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Telugu Gurpatwant, Gurpatwantsingh, India, Indian, Khalistan, Raw, Sikh Separati

ఈ క్రమంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్( Vedant Patel ) సైతం స్పందించారు.పన్నూ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్‌తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.కేసులో కొత్త వివరాల కోసం ఢిల్లీని ఆరా తీస్తున్నామని.

భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని వేదాంత్ పటేల్ చెప్పారు.ఇకపోతే.

గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో నిఖిల్ గుప్తా ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ నిర్బంధంలో వున్నాడు.పన్నూన్‌ను హత్య చేసేందుకు నిఖిల్ సుపారీ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇతనిని తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ఆ దేశాన్ని కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube