వలసదారుల సంక్షోభం .. ఫ్లైటెక్కిన తొలి శరణార్ధి, బ్రిటన్‌ రువాండా ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా .. ?

దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను తగ్గించడానికి ప్రధాని రిషి సునాక్( PM Rishi Sunak ) సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ వీసా( Family Visa ) నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది.

 Britain Sends First Voluntary Asylum Seeker To Rwanda Report Details, Britain ,-TeluguStop.com

తాజాగా బ్రిటన్‌కు చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించే వలసదారులను నిరోధించడానికి రూపొందించిన పాలసీని పార్లమెంట్ ఆమోదించింది.

Telugu Britain, British, Voluntaryasylum, Pm Rishi Sunak, Rwanda, Rwanda Polity,

రువాండా బిల్లు( Rwanda Bill ) ప్రకారం బ్రిటన్‌కు అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ దూరంలోని ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు.ఆ దేశ రాజధాని కిగాలిలో ఏర్పాటు చేసిన శరణార్ధి శిబిరాల్లో వుంచుతారు.

ఇందుకోసం ఏప్రిల్ 2022లోనే బ్రిటన్ ప్రభుత్వం( Britain Govt ) ఒప్పందం చేసుకుంది.ఇలా తరలించేందుకు గానూ ఆ దేశానికి యూకే( UK ) ఇప్పటి వరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది.

అయితే రువాండా పాలసీపై విమర్శకులు మండిపడుతున్నారు.ఆశ్రయం కోరుకునేవారిని రువాండాకు తరలించే ప్రయత్నాలను పున: పరిశీలించాలని.ఇలా చేయడం చట్టవిరుద్ధమని చెబుతున్నారు.అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది.తనను ఆశ్రయం కోరిన వ్యక్తిని రువాండాకు పంపినట్లుగా ది సన్ వార్తాపత్రిక నివేదించింది.గుర్తింపు తెలియని వలసదారుడు సోమవారం దేశం నుంచి వెళ్లినట్లుగా చెప్పారు.

Telugu Britain, British, Voluntaryasylum, Pm Rishi Sunak, Rwanda, Rwanda Polity,

కొత్త చట్టం ప్రకారం .ఇప్పటికే వున్న కొన్ని యూకే మానవ హక్కుల చట్టాలు ఈ పథకానికి వర్తించవు.రువాండాను బ్రిటీష్ న్యాయమూర్తులు సురక్షితమైన గమ్యస్థానంగా పరిగణించాలి.కొన్ని అసాధారణ కేసులకు మాత్రమే ఈ చట్టం కింద అప్పీల్‌ను పరిమితం చేశారు.10 నుంచి 12 వారాల వ్యవధిలోగా మొదటి విమానాలు బయల్దేరతాయని, ఎయిర్‌ఫీల్డ్ సిద్ధంగా వుందని ప్రధాని రిషి సునాక్ తెలిపారు.విమానాల కోసం స్లాట్‌లు బుక్ చేశామని.

వలసదారులను ఎస్కార్ట్ చేయడానికి 500 మంది సిబ్బంది కూడా సిద్ధంగా వున్నారని , అప్పీళ్లను ప్రాసెస్ చేయడానికి కోర్టులను కూడా రిజర్వ్ చేశారని యూకే ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube