కీర్తి సురేష్‌ కూడా హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యింది

ఆరు నెలల గ్యాప్‌ తర్వాత స్టార్స్‌ మళ్లీ షూటింగ్స్‌ లో జాయిన్‌ అవుతున్నారు.మొదటి నుండి కూడా సెప్టెంబర్‌ నెల నుండి షూటింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉందని మేము చెబుతు వచ్చాం.

 Mahanati Keerthi Suresh Reached In Hyderabad For Movie Shooting,  Keerthi Suresh-TeluguStop.com

అన్నట్లుగానే ఈ నెలలో ఎక్కవ షూటింగ్స్‌ పునః ప్రారంభం అవుతున్నాయి.ఇంకా కొంత మంది స్టార్‌ హీరోయిన్స్‌ మరియు హీరోలు బరిలోకి దింగేందుకు భయపడుతూనే ఉన్నారు.

వారు అక్టోబర్‌ లేదా నవంబర్‌ నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లావణ్య త్రిపాఠి ఇంకా పలువురు హీరోయిన్స్‌ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

తాజాగా కీర్తి సురేష్‌ కూడా చెన్నై నుండి హైదరాబాద్‌ ల్యాండ్‌ అయ్యింది.ఈమె నటించబోతున్న సినిమా ఏంటీ అనే విషయంలో స్పష్టత లేదు.కాని ఈమె ఒక తెలుగు సినిమా షూటింగ్ నిమిత్తం మూడు వారాల పాటు హైదరాబాద్‌ లో ఉండేందుకు గాను ఇక్కడకు వచ్చిందట.శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈమె కనిపించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.కీర్తి సురేష్‌ తెలుగులో మహానటి తర్వాత స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది.

ఖచ్చితంగా ఈమె భారీ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను కంటిన్యూగా చేస్తుందని ఆశిస్తున్న సమయంలో పెంగ్విన్‌ సినిమాతో నిరాశ పర్చింది.

ప్రస్తుతం ఈమె అభిమానులు అంతా కూడా ‘మిస్‌ ఇండియా’ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఆ సినిమా ఎప్పుడు విడుదల అనే విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇదే సమయంలో ‘గుడ్‌ లక్‌ సఖి’ కూడా ఈమె చేస్తుంది.

కనుక ఆ సినిమా షూటింగ్‌ కోసమే కీర్తి హైదరాబాద్‌ వచ్చి ఉంటుంది అనేది కొందరి మాట.అసలు విషయం ఏంటో కాని మహానటి కూడా ఆరు నెలల తర్వాత షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube