ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.వాయుగుండం నేడు తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి దాదాపు మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.
అదేవిధంగా చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యల కోసం ఐదు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది.ఈనెల 10 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.