గత వారం ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన కన్నడ మాతృక ఉన్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2.రిలీజ్ అయిన నాటి నుండి నేటి వరకు మంచి టాక్ తో థియేటర్ లలో ప్రదర్శించబడుతోంది.
ఒకవైపు థియేటర్ లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉన్నప్పటికీ దానికి మించిన కలెక్షన్ లను సాధిస్తూ ఎందరో సినిమా డైరెక్టర్ లకు చెమటలు పట్టిస్తోంది.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకున్న శక్తిని అంత ఈ సినిమాపై ప్రయోగించినట్లుగా ఉంది.
యశ్ తో తీసిన ఎలివేషన్ సీన్ లకు థియేటర్ లో విజిల్స్ వినబడుతున్నాయి.అంతలా కేవలం మూడవ చిత్రానికి ప్రశాంత్ నీల్ పరిణితి చెందాడు.
ఇప్పుడు అందరూ రాజమౌళికి పోటీగా మరో డైరెక్టర్ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు.
ఐపిఎల్ ఫీవర్ కొనసాగుతున్న తరుణంలో ఒక సినిమా అంతకు మించిన హైప్ తో భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించింది అంటే అటువంటి ఘనత కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి సాధ్యమయ్యింది చెప్పాలి.
ఇది శాండిల్ వుడ్ డప్పు కొట్టుకుంటూ చెబుతున్న మాట కాదు, బాలీవుడ్ బడా మూవీ డిస్ట్రిబ్యూటర్లు , థియేటర్ యాజమాన్యాలు కోడై కూస్తున్న మాట.నిజమే కదా ఒక వైపు ఐపిఎల్ నడుస్తుంటే బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టే కలెక్షన్లు అంటే కేజీఎఫ్ కే సాధ్యం అయిందని చెప్పాలి.

తాజాగా G7 మల్టీప్లెక్స్ మరియు మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ లు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో .కేజీఎఫ్ చాప్టర్ 2 ఖ్యాతిని అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీ యొక్క గొప్పతనాన్ని ఆకాశానికెత్తేశారు.ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియా సినిమాలు లేకపోతే చాలా మంది థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ ప్రశంసలు కురిపించారు.
కరోనా పాండమిక్ తరవాత వచ్చిన సౌత్ సినిమాలు సక్సెస్ సాధించడం వలనే బాలీవుడ్ ఎగ్జిబిటర్‌లు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు కరోనా కష్టాలను దాటి లాభాలను అందుకున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ పంపిణీదారులు ఇలా సౌత్ సినిమాలని పొగడటం అంటే నిజంగా గర్వించదగ్గ విషయమే.అంతేకాదు సౌత్ ఇండియా సినిమాలు సాధించిన సక్సెస్ కారణం గానే నేడు మళ్ళీ సినీ బిజినెస్ ట్రాక్ లోకి వచ్చింది అంటూ పేర్కొన్నారు.అలాగే కరోనా కారణంగా ఒక వైపు నష్టాలు, మరో వైపు ఇక్కడ బాలీవుడ్ సినిమాలు సరైన సక్సెస్ లేక విలవిలలాడుతున్న తరుణంలో కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్, పుష్ప లాంటి సౌత్ చిత్రాలు మాకు బాగా లాభాలు తెచ్చిపెట్టాయి.ఈ చిత్రాలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.







