ఇకనుండి ఎల్‌పీజీ గ్యాస్ తో పనిలేదు... మార్కెట్లోకి కొత్త స్టవ్‌లు వచ్చేశాయ్!

మనం కట్టెల పొయ్యిలను మర్చిపోయి చాలా సంవత్సరాలు గడుస్తోంది.మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి కూడా మారుతున్నాడు.

 Oil Marketing Company Hpcl To Be Introduce New Ethanol Cooking Stoves , From N-TeluguStop.com

ఇపుడు వంట చేసుకోవాలంటే ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే.కట్టెల పొయ్యిల స్థానంలోకి గ్యాస్ స్టవ్స్ వచ్చి పడ్డాయి.

పల్లెల్లో కూడా పూర్తిగా గ్యాస్ మీదే వంట చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగిపోయింది.

ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు కొలువుదీరాయి.దీనినే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి.

అవును, అందరికీ తెల్సిందే.గ్యాస్ సిలిండర్( Gas cylinder )ధరలను గత కొన్నేళ్లుగా పెంచుకుంటూనే వస్తున్నయి.దీని ఫలితంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ఆకాశాన్నతాకింది.సగటు సామాన్యుడు గ్యాస్ కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.ఇపుడు గ్యాస్ సిలిండర్ ఇంటికి రావాలంటే దాదాపు రూ.1200 నుండి 1250 ఖర్చు చేయాల్సిన పరిస్థితి.గతంలో సిలిండర్ ధర సగం కన్నా తక్కువగానే ఉండేది.

అయితే, గ్యాస్ సిలిండర్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్( Hpcl ) కొత్త కుకింగ్ స్టవ్స్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.ఎల్‌పీజీ( LPG gas ) ఖర్చు తగ్గించడానికి కంపెనీ కొత్త స్టవ్స్ లాంచ్ చేయడానికి పూనుకున్నాయి.ఇథనాల్ ఫ్యూయెల్ కుకింగ్ స్టవ్స్( Ethanol Cooking Stoves ) అనేవాటిని మార్కెట్‌లోకి తేవాలని యోచిస్తున్నాయి.

అంటే ఎల్‌పీజీ సిలిండర్ అవసరం లేకుండానే మీరు ఇంట్లో వీటి ద్వారా వంట చేసుకోవచ్చన్నమాట.బయో ఇథనాల్ అనేది పర్యావరణ అనుకూలం కూడాను.దీని రేటు రెగ్యులర్ పెట్రోల్ కన్నా తక్కువగానే ఉండనుంది.ఇలా రానున్న కాలంలో ఫ్యూయెల్ బిల్లు బాగా తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube