దసర మూవీ ఎలా ఉందంటే..?

నాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ దసరా.( Dasara ) కీర్తి సురేష్ ( Keerthy Suresh )హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) తెరకెక్కించారు .ఈ సినిమా నుండి వచ్చిన పాటలు టీజర్, ట్రైలర్ దేనికవే విశేషంగా ఆకట్టుకోవడంతో .సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి .నాని తన గత చిత్రాలకు భిన్నంగా తనలోని మాస్ పవర్ చూపించడం కూడా సినిమాపై ఆసక్తి పెంచింది .తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా నానికి విజయాన్నిఅందించిందా.పాన్ ఇండియా స్టార్ గా ఈ సినిమా ద్వారా నాని ఈ మేరకు సత్తా చాటారు అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం ముందుగా కధ విషయానికి వస్తే .ఇది ఒక సాధారణ యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన కధ .తెలంగాణ లోని గోదావరిఖని లో వున్న బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుంది.ధరణి , వెన్నెల ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.

 How Is The Dasara Movie ,dasara , Nani , Keerthy Suresh,srikanth Odela,coal Mi-TeluguStop.com

ఈక్రమంలో ధరణికి ఊర్లో సమస్యలు మొదలవుతాయి.ధరణికి ఎదురైనా సమస్యలేంటీ, దానివల్ల ధరణి ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు.

చివరికి అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.

 How Is The Dasara Movie ,Dasara , Nani , Keerthy Suresh,Srikanth Odela,Coal Mi-TeluguStop.com
Telugu Dasara, Dixit Shetty, Keerthy Suresh, Nani, Poorna, Sai Kumar, Samudrakha

సాధారణ విలేజ్ కుర్రాడిలా ఉన్న ధరణి ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం .ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .నానిని మాస్ పాత్రలో చూపించడంలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలావరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు .ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగిన పరిణామాలని చూపించిన విధానం బాగుంది .గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల చుట్టు పక్కల ఇరు వర్గాల మధ్యన జరిగే గొడవను బేస్ చేసుకుని రూపొందించిన సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి .ఇక నాని మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు .అతని బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా ఉంది.పురాణాలను మించిన బతుకులా మనవి వంటి డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి .ఇక కీర్తి సురేష్ కూడా మాస్ లుక్ లో బాగుంది .ధరణిగా పెట్టి పుట్టావురా అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుది.నాని చెప్పిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తాయి .అయితే మితి మీరిన యాక్షన్ సీన్స్ కాదని కొంత పక్క దారి పట్టించాయేమో అనిపిస్తుంది .అలాగే కొన్ని సీన్స్ కావాలని చూపించినట్లు అనిపిస్తుంది .అయితే సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా సాగిపోతూ … ఆడియెన్స్ ని అలరించడం సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు

Telugu Dasara, Dixit Shetty, Keerthy Suresh, Nani, Poorna, Sai Kumar, Samudrakha

ఇక నటీనటుల విషయానికి వస్తే నాని తనలోని పూర్తిస్థాయి నటుడిని సరికొత్తగా పరిచయం చేశాడు .తన కెరీర్ లోనే ఊర మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు.కొన్ని సీన్స్ లో నాని నటన చాలా బాగుంది.ఎమోషన్స్ ను పలికించిన విధానం సూపర్ అని చెప్పవచ్చు .ధరణి పాత్ర నాని కెరీర్ లో బెస్ట్ రోల్స్ లో ఒకటిగా మిగిలిపోతుంది.అలాగే వెన్నెల పాత్ర మరో హైలైట్.

ఆపాత్రలో కీర్తి సురేష్ ఇదిగిపోయింది , మహానటి తరువాత ఆ రేంజ్ నటన దసరాలో చూపించింది.నాని, కీర్తి కెమిస్ట్రీ అదిరిపోయింది.అలాగే మిగితా కీలక పాత్రల్లో నటించిన దీక్షిత్ శెట్టి , సముధ్రఖని ,సాయి కుమార్, పూర్ణ వంటి వారు తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు .ఇక సాంకేతిక విషయాలకు వస్తే … దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి సినిమానే అనుభవం గల దర్శకుడిగా తెరకెక్కించారు .సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు మరో హైలైట్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది .చాలా సన్నివేశాలను మ్యూజిక్ హెలైట్ చేసింది.సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది .సంభాషణలు ఆకట్టుకుంటాయి .నిర్మాణ విలువలు కూడా రిచ్ గ ఉన్నాయి .మొత్తంగా చూస్తే సినిమా చాలా వరకు అలరిస్తుందని చెప్పవచ్చు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube