కార్తిక మాసం( Karthika Masam )లో దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టిన వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు.
అలాగే వేకువ జమున నిద్రలేచి స్నానం చేసి కార్తీక దీపాలు నీటిలో వదులుతారు.దీపాలను వెలిగించే పని కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే మంచిదని చాలామంది ప్రజలు నమ్ముతారు.కానీ ఉసిరికాయ తో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు.
ఉసిరికాయ గుండ్రంగా ఉంటుంది.దానితో దీపం ఎలా పెట్టాలి అనే దాని గురించి చాలా మందిలో సందేహం ఉంటుంది.
మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి? దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి.ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి చెట్టుకే కాకుండా ఉసిరికాయలకు కూడా కార్తీక మాసంతో ఎంతో సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు.ఉసిరి చెట్టును సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా చాలా మంది ప్రజలు భావిస్తారు.అంతేకాకుండా శివ కేశవులతో పాటు బ్రహ్మ సకాల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.అంతటి విశిష్టత కలిగిన ఉసిరి కి కార్తీకమాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అందుకే కార్తీక మాసంలో మరి ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.కార్తీక పౌర్ణమి( Karthika Pournami ) రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

కార్తిక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యను గుండ్రంగా కట్ చేస్తే దీపం తయారవుతుంది.ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామర కాడల ఒత్తులను వేసి దీపం వెలిగించాలి.ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి( Goddess Lakshmi ) సంతోషిస్తారు.దానితో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఉసికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలతో పాటు నరదిష్టి కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.