టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ).ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె నటించిన ఖుషి ( Khushi )సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఇక ఇందులో భాగంగా హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ లోసమంత పాల్గొని సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.
అదేవిధంగా తన ఆరోగ్యం గురించి కూడా సమంత తెలియజేశారు.
ఇలా సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేసినటువంటి ఈమె గతంలో తనని విమర్శలకు గురిచేసిన వారికి ఈ వేదికపై భారీగానే కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్ల నాకు విజయవాడ సెంటర్లో ఇడ్లీ స్టాల్ ( Idly Stall ) పెట్టుకునే పరిస్థితి రాలేదు అంటూ ఈమె కామెంట్ చేశారు.అయితే సమంత ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సమంత ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
ఈ విధంగా సమంత ఈ వేదికపై ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి రాలేదు అంటూ మాట్లాడటంతో గతంలో తనకు ఆరోగ్యం బాగా లేకపోయినప్పుడు ఎవరైనా ఇలాంటి విమర్శలు చేశారా? మరెవరి నుంచి అయినా ఆమె ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలను ఎదుర్కొన్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా సమంత మాత్రం తనను విమర్శలకు గురిచేసిన వారికి ఈ వేదిక నుంచి భారీగానే కౌంటర్( Counter ) ఇచ్చారని తెలుస్తోంది.ఇలా ఈ వేదికపై సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.