వైరల్: మెట్రోలో ఒకామె శరీరం సగం బయటుండగానే మూసుకుపోయిన డోర్లు.. జరిగిందిదే!

మెట్రో రైలు( Metro train ) ప్రయాణం ఎంత సౌకర్యవంతమో కొన్నిసార్లు అంత నరకంగా వుంటుందని ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.కొన్నిసార్లు ఆ ప్రయాణం ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది.

 Viral: The Doors Of A Woman's Body Were Closed In The Metro With Half Of It Outs-TeluguStop.com

త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది కదులుతున్న రైళ్లను ఎక్కుతూ కోరి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.కొందరు అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు.

మరికొందరు పాపం ప్రాణాలు కోల్పోతుంటారు.ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఓ మహిళ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆమె రద్దీగా ఉన్న ఓ రైలును ఎక్కింది.ఆమె బయట ఉండగానే డోర్లు మూసుకుపోయాయి.బోగీలోకి వెళ్లేందుకు స్థలం లేకున్నా అలాగే ఎక్కేసింది.

కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకున్నా డోరు వద్ద అలాగే నిలబడి ఉంది.రైలు కదలడానికి ముందు డోరు ఆటోమేటిక్‌గా దగ్గరగా జరిగింది.

మహిళ అడ్డుగా ఉండడంతో డోరు మూసుకుపోయేందుకు వీలు లేకుండా పోయింది.ఈ క్రమంలో డోరు మధ్య ఎక్కడ ఇరుక్కుపోతానో అని మహిళ చాలా భయపడింది.

అయితే జనం రద్దీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు.చివరకు కింద ఉన్న ఓ వ్యక్తి.

ఆమెను ఎలాగోలా లోపలికి నెట్టేయడంతో డోరు మూసుకుపోయింది.

దాంతో ఆమె హమ్మయ్య బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుంది.ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

చాలామంది ఆమెని మందలిస్తూ… “ఇంత ఇబ్బంది పడుతూ ప్రయాణించడం అవసరమా?” అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు, “ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు!” అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube