వారెవ్వా.. కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

వెండి పట్టీలు( silver anklets )ఆడవారి అందాన్ని పెంచే ఆభరణాల్లో ఒకటి.ఆడపిల్లలు తమ కాళ్ల‌కు వెండి పట్టీలు ధరించడం అనేది పురాతన కాలం నుంచి వ‌స్తున్న ఆనవాయితీ.

 Wonderful Health Benefits Of Wearing Silver Anklets! Silver Anklets, Silver Ankl-TeluguStop.com

ఆడపిల్లలు కాళ్లకు పట్టీలు ధరించి ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు ఉంటుందని అంటుంటారు.అందుకే ఆడపిల్ల పుట్టిన నెల రోజులకే కాళ్ల పట్టీలు పెట్టి తల్లిదండ్రులు తెగ మురిసిపోతూ ఉంటారు.

కానీ నేటి ఆధునిక కాలంలో చాలా మంది అమ్మాయిలు పట్టీలు పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు.ముఖ్యంగా సిటీలో ఉండే అమ్మాయిల్లో సగానికి పైగా మంది పట్టీలు తీసి పక్కన పడేస్తున్నారు.

Telugu Anklets, Tips, Latest, Silver, Silver Anklets, Silveranklets-Telugu Healt

అయితే కాళ్లకు వెండి పట్టీలు ధరించడం అనేది సంప్రదాయం మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది ఎందుకంటే వెండి పట్టీలు ధరించడం వెన‌క సైన్స్ కూడా ఉంది.అవును వేడి ప‌ట్టీలు ఆడవారి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వెండి ప‌ట్టీలు పెట్టుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు పొంద‌వ‌చ్చో తెలుసుకుందాం ప‌దండి.సాధారణంగా మగవారితో పోలిస్తే ఆడవారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.

అయితే వెండికి బాడీని కూల్ గా మార్చే సామ‌ర్థ్యం ఉంది.కాళ్ల‌కు వెండి ప‌ట్టీలు ధ‌రించ‌డం వ‌ల్ల‌ శరీరంలో అధిక వేడిని తొలగిపోతుంది.

అలాగే ఇటీవ‌ల ఎంతో మంది ఆడ‌వారు హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు.దీని వల్ల రుతుక్రమ సమస్యలు, సంతానలేమి వంటివి త‌లెత్తుతున్నాయి.

అయితే వెండి మహిళల్లో హార్మోన్ స్థాయిలు సమతుల్యం చేయ‌గ‌ల‌ద‌ని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Telugu Anklets, Tips, Latest, Silver, Silver Anklets, Silveranklets-Telugu Healt

అందువ‌ల్ల వెండి ప‌ట్టీలు ధ‌రిస్తే మ‌హిళ‌లు రుతుక్రమ మ‌రియు గర్భాశయం సమస్యలకు దూరంగా ఉంటారు.ఆడ‌వాడు రోజంతా నిల‌బ‌డి ఎన్నో ప‌నులు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే కాళ్ల నొప్పులు( Leg pains ) వారిని విప‌రీతంగా వేధిస్తుంటాయి.

అయితే కాళ్ల‌కు పట్టీలు ధరించడం ఆక్యుప్రెషర్ వైద్యం లాంటిది.మహిళల్లో కాళ్ల నొప్పుల నివారణకు వెండి పట్టీలు సహాయపడతాయి.

అంతేకాదు వెండి ప‌ట్టీలు ధ‌రించ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.అనేక వైరస్, బ్యాక్టీరియా దాడుల నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఎముకలు దృఢంగా తయారవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube