ప్రస్తుత వేసవికాలంలో ( Summer ) గంట బయట తిరిగారంటే చాలు ముఖం మొత్తం నల్లగా కాంతిహీనంగా మారిపోతుంటుంది.అటువంటి సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా ఆఫీస్ లో మీటింగ్ ఉంది అంటే తెగ హైరానా పడిపోతుంటారు.
నల్లగా, కాంతిహీనంగా మారిన చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ టెన్షన్ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పది నిమిషాల్లో మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) మరియు వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్( Brown Sugar ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ మరియు బ్రౌన్ షుగర్ పౌడర్ ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా మరో ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ ( Scrubbing ) చేసుకోవాలి.స్క్రబ్బింగ్ పూర్తయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని ( Skin ) క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల మీ ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.

ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.టాన్ ను పూర్తిగా రిమూవ్ చేస్తుంది.మళ్లీ మీ చర్మం తెల్లగా కాంతివంతంగా( Bright Skin ) మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
పది నిమిషాల్లో వైట్ అండ్ బ్రైట్ గా మెరిసిపోవాలని కోరుకునే వారికి ఇది టాప్ అండ్ బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.