ప్రపంచంలో కొందరు అదృష్టాన్ని నమ్మితే, మరి కొందరు తమ శ్రమను, స్వశక్తిని నమ్ముకొంటారు.కానీ కాలం ఎంత శక్తి వంతం అయినది అంటే ఒక్కో సారి ఊహించని ట్విస్ట్‌లను ఇస్తుంది.
అప్పుడే కళ్లముందు స్టార్ హోదా వస్తుంది.కానీ ఎప్పుడు దాన్ని లాగేసుకుంటుందో తెలియదు.
ఇలా ప్రపంచంలో సెలబ్రెటీలుగా ఒక వెలుగు వెలిగిన వారు ఎన్నో కష్టాలను కూడా అనుభవిస్తున్న సందర్భాలు కోకొల్లలు.ఇకపోతే ఆస్ట్రేలియాకు చెందిన జేవియర్ డోహెర్టీ ఇంటర్నేషనల్ క్రికెట్ మాజీ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా 2015 ప్రపంచ కప్ కొట్టిన జట్టులో కీలక ఆటగాడు.ఇక దాదాపు 17 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఈ ఆటగాడు నాలుగేళ్ల క్రితం క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

దీనికి తోడు కాలం వెక్కిరించడంతో కార్పెంటర్ పనికి వెళ్తు ఉపాధి పొందుతున్నాడట.చూశారా కాలం కలిసి రాకపోతే ఎంతటి వారైనా కూటి కోసం తిప్పలు పడవలసిందే.