తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇంకా ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవన్ని క్షణకాలమైనా కనులారా చూద్దామని ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా తట్టుకొని చాలా దూరం నుంచి తిరుమలకు భక్తులు చేరుకుంటారు.అలాంటి భక్తులు ఈ మార్పులు కచ్చితంగా తెలుసుకోవాలి.
మార్చి 1వ తేదీ నుంచి తిరుమలలో భక్తులకు ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి తీసుకొని వచ్చారు.
భక్తులకు సేవలను సజావుగా అందించడంతో పాటు పారదర్శకత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది.ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని మొదట సర్వదర్శనం కౌంటర్లు, తిరుమలలోని లడ్డు కౌంటర్లు, వసతి కేంద్రాల్లో ప్రవేశపెట్టారు.ఈ విధానంతో దళారుల వ్యవస్థ తగ్గే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలులోకి తీసుకురావడం వల్ల ఒక భక్తుడు నెలకు ఒక్కసారి మాత్రమే తిరుమలలో రూమ్ పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది.
దీంతో నెలలో ఒకసారి మాత్రమే ఉచిత దర్శనం చేసుకునేందుకు భక్తులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.కొత్త విధానం వల్ల తిరుమలలో ఉచిత దర్శనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఇప్పటి నుంచి నెల వ్యవధిలో ఒకసారికే పరిమితం అవుతారని వెల్లడించారు.భక్తుల కోసం సబ్సిడీ అద్దె గదుల కేటాయింపులను ఫేస్ రికగ్నిషన్ సంకేతికత ఉపయోగపడుతుందని తిరుమల దేవస్థానం వెల్లడించింది.
గదులను పొంది వాటిని ఎక్కువ రేటుకు విక్రయించి మధ్యవర్తులను గుర్తించడం లో కొత్త విధానం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మరి ఈ విధానం భక్తులకు ఎలా అనిపిస్తుందో కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.