సాధారణ శివరాత్రి అంటే ప్రతినెల వస్తూనే ఉంటుంది.కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకునే అపురూప ఘట్టాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు.
ఈ రోజున శివుడు శక్తి కలయిక జరిగే రాత్రిగా ప్రజలందరూ నమ్ముతారు.ఆ తర్వాత అనంత విశ్వానికి ప్రతిరూపంగా ఉండే శివుడు అనంతంలోని శక్తిగా పేర్కొనే పార్వతి కలయిక జరిగే రాత్రి కాబట్టి దీనిని మహాశివరాత్రి అని చెబుతారు.
శివుడు ఈ రోజు లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణాలు చెబుతున్నాయి.మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ.
ఈ రోజు శివుడు, పార్వతి వివాహం చేసుకొని పార్వతి పరమేశ్వరులుగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి.పురుషుడు అంటే సంస్కృతంలో ఆత్మ, మనసు అని అర్థం వస్తుంది.
స్త్రీని ప్రకృతిగా కొలుస్తారు.శివుడు పురుషుడు అయితే పార్వతి ప్రకృతి స్వరూపం వీరి కలయిక ప్రకృతిలో జీవం పోస్తోంది.
ఈ రకంగా మహాశివరాత్రి సృష్టి కారకంగా ఉంటుంది.చీకటిని అధిగమించి జ్ఞానానికి ఉదయంగా ఈ రాత్రినీ చెప్పవచ్చు.అందుకే మహాశివరాత్రి కి అంతటి ప్రాముఖ్యత ఉంది.ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం చలికాలం ముగిసిపోయే దశలో వసంత రుసుము మొదట్లో మహాశివరాత్రి ఉంటుంది.అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ పండుగ ఉండవచ్చు.అయితే ఈ సంవత్సరం 2023 మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన శనివారం రోజు జరుపుకుంటున్నారు.చతుర్దశి తిధి ఫిబ్రవరి 18, 2023న రాత్రి 8.02 నిమిషములకు మొదలవుతుంది.ఫిబ్రవరి 19,2023న సాయంత్రం 4.18 నిమిషములకు ముగుస్తుంది.శివరాత్రి మొదటి ప్రహార పూజా సమయం సాయంత్రం 6.13 నిమిషాల నుంచి 9.24 నిమిషాల వరకు ఉంటుంది.మహాశివరాత్రి రోజు శివుని భక్తులందరూ రోజంతా ఉపవాసం ఉంటారు.
శివాలయాలను సందర్శించే శివపార్వతులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు.ఆ రోజు రాత్రి జాగరణ చేస్తూ శివనామస్మరణతో శివుని భజన చేస్తారు.
DEVOTIONAL