మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈయన విశ్వంభర( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా చిరంజీవి తన కొత్త సినిమాని కూడా ప్రకటించారు.
అయితే గత కొద్ది రోజులుగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Sreekanth Odela ) దర్శకత్వంలో నాని( Nani ) ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
శ్రీకాంత్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాని నిర్మాణంలో ఈ చిత్రం రాబోతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.ఇక ఈ పోస్టర్లో చిరంజీవి చేతి నుంచి రక్తం కారుతూ ఉన్నట్టు కనిపించడంతో ఈ సినిమా యాక్షన్ సినిమా అని స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా గురించి నాని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
నేను చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను ఆయన సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడ్డాను.ఆయన సినిమా కోసం నా సైకిల్ కూడా పోగొట్టుకున్నాను.ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేస్తున్నాను.ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది.
మనందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మ్యాడ్ నెస్ రాబోతుంది.దీని గురించి కలలు కన్నా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది అంటూ నాని ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన నాని ఇప్పుడు చిరంజీవి సినిమాకే నిర్మాతగా మారడం అంటే ఇదే అసలైన సక్సెస్ అంటూ నాని అభిమానులు కామెంట్లు చేస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.