పీక కోస్తా అంటూ మైదానంలో కోహ్లీ విచిత్ర ప్రవర్తన.. వీడియో వైరల్!

గత కొద్ది నెలలుగా విరాట్ కోహ్లీ మైదానంలో ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది.నిజానికి కోహ్లీ తన ఎమోషన్స్‌ను అస్సలు దాచుకోలేడు.

 Kohli's Strange Behavior On The Field. Viral News, Social Media, Viral Video, Viral Latest, Kohli, Cricket-TeluguStop.com

ఇతర ప్లేయర్లకు మాటల్లో, చేతల్లో దీటుగా బదిలివ్వడం కోహ్లీ నైజాం.మైదానంలో గొడవకి దిగేందుకు కూడా ఈ మాజీ కెప్టెన్ సందేహించడు.

అయితే ఇటీవల జరిగిన ఒక మ్యాచ్‌లో కోహ్లీ శుభ్‎మన్ గిల్‌పై స్లెడ్జింగ్‌కు దిగి అందరినీ నివ్వెరపరిచాడు. బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పీక కోస్తా అంటూ కోహ్లీ శుభ్‎మన్ గిల్‌ వైపు చూస్తూ సైగ చేశాడు.

 Kohli's Strange Behavior On The Field. Viral News, Social Media, Viral Video, Viral Latest, Kohli, Cricket -పీక కోస్తా అంటూ మైదానంలో కోహ్లీ విచిత్ర ప్రవర్తన.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో బాగా రాణించాడు.54 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో బాది 73 పరుగులు చేసి తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచి తన సత్తా చూపించాడు.ఇదంతా బాగానే ఉంది కానీ ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‎మన్ గిల్‌కు కోహ్లీ వెరైటీ సంజ్ఞ చేశాడు.గిల్ ను చూస్తూ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రముఖ రెజ్లర్ 100 టేకర్ తన ప్రత్యర్థులకు చూపించినట్లుగా పీక కోస్తాఅని సైగ చేశాడు.

సంజ్ఞ చేశాడు.ఇది చూసిన శుభ్‎మన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అనంతరం గిల్ కూడా కోహ్లీ వైపు సీరియస్‌గా చూస్తూ మైదానాన్ని విడిచి వెళ్ళాడు.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ముందుంది ముసళ్ల పండగ అప్పుడు డే సెలబ్రేట్ చేసుకోకు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.కోహ్లీ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు అని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.

మరికొందరు మాత్రం కోహ్లీ ఆన్ ఫైర్ అంటూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube