కేంద్రం తగ్గించింది... జగన్ కరుణిస్తారా ? 

దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి.సామాన్యులకు సైతం అవి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Ap Demands Reduction Of Government Taxes On Petrol Diesel And Gas Bjp, Central G-TeluguStop.com

ఆ ప్రభావం కేంద్ర అధికార పార్టీ బిజెపి పై ఎక్కువగా పడింది.కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బిజెపి సామాన్యులకు ఊరట కలిగిస్తే బీజేపీకి ఆదరణ దక్కుతుందనే విషయాన్ని గుర్తించింది.

దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు .పెట్రోల్ ,డీజిల్ తో పాటు వంట గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.లీటర్ పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు డీజిల్ పై ఆరు రూపాయలు , వంటగ్యాస్ ధరను 200 కు తగ్గిస్తూ కేంద్రం ప్రకటన చేయడంపై దేశవ్యాప్తంగా కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

  అయితే ఈ సందర్భంగా ఏపీ వ్యవహారమూ తెరపైకి వచ్చింది.

చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్,  డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.దీనికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులే కారణం.

దీనిపై తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.కేంద్రంలోని బిజెపి అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం , అందరి విశ్వాసం పొందేందుకు సమర్ధ పాలన అందిస్తోందని,  కరోనాతో కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్ని రేట్లు పెరిగిపోయాయని, అందుకే సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్రం పెట్రోల్,  డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించింది అని వీర్రాజు చెప్పుకొచ్చారు .గతంలోనూ కేంద్రం రేట్లను తగ్గించినా,  ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం వాటిని తగ్గించలేదని , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటిపై సుంకాలను తగ్గించారని వీర్రాజు చెప్పుకొచ్చారు. 

Telugu Ap Bjp, Ap Tax, Central, Gas, Diesel, Petrol, Somu Veerraju-Politics

జగన్ గారూ ! ఈసారైనా స్పందించండి.మీ వంతుగా పన్నులు తగ్గించి పెట్రోల్ , డీజిల్ ధరలు మరింత అందుబాటు ధరలో దొరికేలా ప్రజలకు సాయం చేయండి.లేదంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు.” అంటూ సోము వీర్రాజు శాపనార్ధాలు పెట్టారు.చాలా కాలంగా ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా పన్నులు విధిస్తున్న విషయమై చర్చ జరుగుతోంది.

దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న , జగన్ మాత్రం ఆ పన్నులను తగ్గించేందుకు ఇష్ట పడలేదు.కానీ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా భారీగా పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించడంతో ఏపీ ప్రభుత్వం విధిస్తున్న పన్నుల విషయంలో సమీక్ష నిర్వహించి వెంటనే తగ్గిన ధరలను అమలులోకి తీసుకొచ్చి సామాన్యులకు ఊరట కలిగించకపోతే వైసిపి ప్రభుత్వం తీవ్ర  ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube