బాక్సింగ్ దిగ్గజం, సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు.రింగులోకి దిగితే చాలు ఆడ సింహంలా విరుచుకుపడే మేరీ కోమ్ ఇప్పటివరకు 8 వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్స్ కైవసం చేసుకుంది.
ఇలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆమె తాజాగా ఒక భారీ త్యాగం చేసింది.ఇండియా తరఫున ఎప్పుడూ తానే ఆడితే, ఇక యువ ప్లేయర్లకు ఛాన్స్ వచ్చేది ఎప్పుడు? వారికి అవకాశం రావాలి కదా! అనే ఉద్దేశంతో ఆమె ఒక భారమైన నిర్ణయం తీసుకుంది.వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్ ఇకపై ఆడనని ఆమె తాజాగా ప్రకటించింది.
కొద్ది గంటల క్రితమే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)తో మేరీ కోమ్ మాట్లాడింది.“యంగ్ జనరేషన్ అంతర్జాతీయ వేదికపై తమకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి, ప్రధాన టోర్నమెంట్‌ల్లో పార్టిసిపేట్ చేయడానికి, అనుభవాన్ని పొందడానికి అవకాశాలు కల్పించాలి.వారికి అవకాశం రావాలంటే మాలాంటి సీరియల్ ప్లేయర్లు తప్పుకోవాలి.
అందుకే నేను వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆసియన్ గేమ్స్ ఆడకూడదని నిర్ణయించుకున్నా.కామన్వెల్త్ క్రీడల సన్నద్ధతపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నాను.” అని మేరీ కోమ్ చెప్పినట్లు బీఎఫ్ఐ వెల్లడించింది.
ఐబీఏ ఎలైట్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్, 2022 ఆసియన్ గేమ్స్ మార్చి 7న ఆరంభమవుతాయి.అయితే వీటిలో మేరీ కోమ్ పాల్గొనడం లేదు.ప్రస్తుతం ఆమె కామెన్వెల్త్ గేమ్స్ కోసమే ప్రాక్టీస్ చేస్తోంది.
భారతీయ బాక్సింగ్ కు 20 ఏళ్లుగా టార్చ్ బేరర్ గా నిలిచి అందరిలో స్ఫూర్తిని నింపింది మేరీ కోమ్.ఆడవారు అయినా సరే ప్రతిభ, పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించొచ్చు ఆమె చెప్పకనే చెప్పారు.
ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బయోగ్రఫీలు కూడా వచ్చాయి.అయితే లేటెస్ట్ గా మేరీకోమ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, ఈ నిర్ణయం ప్రశంసించదగినదేనని ఇండియా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ పేర్కొన్నారు.