సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది.తమిళ నటుడు, ప్రముఖ దర్శకుడు ఆర్ఎన్ఆర్ మనోహర్ కన్నుమూశారు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ తాజాగా చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.మనోహర్ ఇరవై రోజుల క్రితం కరోనా బారిన పడడంతో అప్పటి నుంచి అదే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.
బుధవారం రోజున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
మనోహర్ మరణవార్త వినగానే హీరోలు, నటులు, సంగీతదర్శకులు, పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
మనోహర్ మరణవార్త విన్న రచయిత,దర్శకుడు, నిర్మాత అయిన పాండీరాజ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి గుండెలవిసేలా రోదించారు.అలాగే అతని మరణవార్త వినీ డి ఇమ్మాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు.మీ ఆత్మకు శాంతి కలగాలి మనోహర్ సర్.మీ స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ మనోహర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఆర్ఎన్ఆర్ మనోహర్ కోలీవుడ్ లో నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నారు.1995 కోలంగల్ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు.దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్ ఇలాంటి సినిమాలలో నటించి నటుడిగా మెప్పించారు.అంతేకాకుండా ఇటీవల విడుదలైన ఆర్య టెడ్డి సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కూడా నటించారు.