ఈ పోలీసులు నడిరోడ్డు మీదకి వచ్చి ఏం చేశారో చూస్తే షాకే!

కొన్ని సార్లు పోలీసులు వ్యవహరించే తీరు సామాన్య ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తాయి.మరికొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి.

 Shocking To See What The Police Have Done On The Road , Police, Road , Viral Lat-TeluguStop.com

తాజాగా అలా నవ్వు తెప్పించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ ఘటన నార్వేలో చోటు చేసుకుంది.

ఈ వీడియోలో ఒక మహిళ తన ఇంటికి సమీపంలో మ్యూజిక్ షో చేస్తున్న వారిపై పోలీసు కంప్లైంట్ ఇస్తుంది.అప్పుడు ఆ పోలీసులు రోడ్డు మీదకి చేరుకుని వారి మ్యూజిక్ షో ఆపాలి అనుకుంటారు.

అంతలో ఒక పోలీసు వారితో జాయిన్ అయి ఓ పాట పాడుతూ షాక్ ఇస్తాడు.దీనికి సంబంధించిన వీడియోని ప్యూబిటీ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

ఈ వీడియోకి ఇప్పటికే మూడు లక్షల వరకు లైకులు వచ్చాయి

వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టుకొని పాటలు పాడుతూ సందడి చేయడం చూడవచ్చు.అయితే ఈ మ్యూజిక్ ఒక గోల లాగా అనిపించిందని అక్కడే నివసిస్తున్న ఒక మహిళ మ్యూజిక్ షో చేస్తున్న వారిపై పోలీసు కంప్లైంట్ ఇస్తుంది.

పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెబుతుంది.దాంతో ఒక మగ పోలీస్ తో పాటు ఆడ పోలీస్ అక్కడికి వచ్చారు.

అక్కడే మ్యూజిక్ వాయిస్తున్న ఇద్దరు మ్యూజిషియన్లు వారిని చూసి భయపడ్డారు.ఏం చేస్తారో ఏమో అని చాలా వణికిపోయారు.

అయితే మగ పోలీసు వారిని ఏమనకుండా వారి చేతిలోని బ్యాగ్ తీసుకుని పాడటం స్టార్ట్ చేశాడు.

దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

వారిని అక్కడి నుంచి వెళ్లగొడతారేమో అనుకున్న పోలీస్‌లే వారితో జాయిన్ అయ్యి ఇలా పాటలు పాడుతూ చూసి కంప్లైంట్ ఇచ్చిన మహిళ కూడా ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేసింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఆ పోలీస్ కి సింగింగ్ పై బాగా ప్రేమ ఉంది అనుకుంటా, అందుకే వారిని ఏమీ అనకుండా తను కూడా అందులో జాయిన్ అయిపోయాడు అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ ఫన్నీ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube