వేల కోట్ల రూపాయల బకాయిలు ముంచేసి మరొక వైట్ కాలర్ నేరస్తుడు దేశాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు.దాదాపు ఐదొందల కోట్లతో బ్రిటన్ చెక్కెయ్య బోతున్నాడు విజయ్ మాల్యా.
దేశ కార్పరేట్ చరిత్ర లో రుణాలు ఎగ్గొట్టి దేశం దాటి వెళ్ళిపోతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయం లో బ్యాంకులు ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకర విషయం.మాల్యా రాజీనామా బయటకి రాగానే భారీ విమర్శలు తలెత్తుతున్నాయి.
ఆయన సంస్థలకి వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని రుణంగా ఇచ్చిన బ్యాంకులు ఎవరికీ సమాధానం ఎలా చెబుతారు ? తాకట్టు పెట్టుకున్న ఆస్తుల్లో ఆయన అప్పులు కనీసం 10 శాతం కూడా వెనక్కి రావు అంటున్నారు.మరి దేశం దాటి పోతున్న ఒక వైట్ కాలర్ క్రిమినల్ మీద చర్యలు తీసుకోరా ? ఒక్క బ్యాంకు కూడా మాట్లాదడే ? అన్ని సంస్థ లనీ అప్పుల ఊబిలోకి నెట్టేసి తాను మాత్రం లగ్జరీ గా బతకడం కోసం 500 కోట్లు జేబులో వేసుకుని మరీ వెళ్లిపోతుంటే చూస్తూ కూర్చోవాల్సిందేనా ? మాల్యా కంపెనీ లలో పని చేస్తున్న వారు వేతనాలు లేక ఆత్మహత్యలకి పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా ? బ్యాంకింగ్ వ్యవస్థ నీ ఉద్యోగులనీ మోసం చేసిన మాల్యా ని చట్టం ముందు నిలబెట్టి అతని నిజస్వరూపం కోర్టులకి చూపించాలి అనేది సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.