మనిషి పెంపుడు జంతువులలో కుందేలు ఒకటి.ఇవి చూడటానికి ఎంతో క్యూట్ గా ఉంటాయి.
అందుచేత అన్నిరకాల వయస్సుల వాళ్ళు వీటిని పెంచుకోవడానికి ఇష్టపడుతూ వుంటారు.అలాగే వాటి సంతాన ఉత్పత్తి కూడా ఎక్కువగా వుండటం చేత వ్యాపారం చేసే వాళ్ళు కూడా వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కుందేలు నడవడం నుండి వాటి తిండి కూడా ముద్దుగానే ఉంటుంది.ఈ క్రమంలో అనేకమందికి కుందేలు విషయంలో ఓ అనుమానం ఉంటుంది.
అదే కుందేలు చెవులు ఎందుకు పెద్దగా ఉంటాయి? అని.ఇక దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
కుందేలు చెవులు సాదారణంగా 2 కారణాలతో పెద్దగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మొదటిది, వాటి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానినకి చెవులు పెద్దవిగా ఉద్భవించాయి అని ఒకటి, అలాగే వాటి చెవులు రేడియేటర్ మాదిరిగా ఉపయోగపడతాయి అని మరొక కారణం చెబుతున్నారు.
విశాలమైన వాటి చెవులలోని రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం, అక్కడ చల్లబడి ఆ తర్వాత తిరిగి శరీరంలోనికి వెళ్తుంది.ఆ విధంగా వాటి శరీరం చల్లబడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక రెండో కారణం చూస్తే, శబ్దాన్ని బాగా వినడానికి మరియు ఎటువైపు నుండి వస్తుందో కచ్చితంగా అంచనా వేయడానికి వాటి చెవులు ఉపయోగపడతాయట.
సాధారణంగా ప్రతి జీవికి రెండు చెవులు ఉండడానికి అసలైన కారణం… శబ్దం వస్తున్న దిశను అంచనా వేసి, మెదడకు చేరవేయడానికి బాగా ఉపయోగపడతాయి.
ఇక కుందేలు కూడా తన పెద్ద పెద్ద చెవులతో శబ్దాలను వేగంగా అంచనా వేసి, ప్రమాదాల నుంచి రక్షణ పొందుతాయి అని చెబుతున్నారు.ఇక మనిషి వినలేని అధిక పౌనపుణ్యంగల శబ్ధాలను కూడా కుందేళ్లు వినగలవు.
కుందేలు తన చెవులను రెండింటిని రెండు వేరు వేరు దిశలకు 270 డిగ్రీల కోణంలో తిప్పుతూ ఉంటాయి.అడవులలో చాలా జంతువులు వీటిని వేటాడుతాయి కనుక వాటి చెవులే వాటికి రక్షణ అని చెప్పుకోవాలి.