బ్రహ్మాస్త్ర పార్ట్1 నష్టం అన్ని రూ.కోట్లా.. సినిమా డిజాస్టర్ అంటూ?

బ్రహ్మాస్త్ర పార్ట్1 సినిమా గురించి మేకర్స్ పాజిటివ్ గా ప్రచారం చేసుకున్నా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర పార్ట్1 తెరకెక్కగా ఈ సినిమా నష్టం ఏకంగా 110 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

 The Loss Of Brahmastra Part 1 Is All Rs. Crores.. Is The Movie A Disaster , Bra-TeluguStop.com

ఈ రేంజ్ లో నష్టం అంటే ఈ సినిమా ఒక విధంగా డిజాస్టర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రహ్మాస్త్ర ఫుల్ రన్ లో 190 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను, 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు ఏకంగా 600 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిన నేపథ్యంలో 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తక్కువ రేట్లకు అమ్మడంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.

Telugu Bollywood, Brahmastra, Mouni Roy, Nagarjuna, Ranbir Kapoor-Latest News -

ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే రికవరీ చాలా తక్కువగానే ఉండటం గమనార్హం.అయితే బ్రహ్మాస్త్ర పార్ట్2, పార్ట్3 కూడా తెరకెక్కుతుండటంతో బయ్యర్లు నష్టాల గురించి చెప్పడానికి ఇష్టపడటం లేదని సమాచారం అందుతోంది.బ్రహ్మాస్త్ర సినిమా నష్టాల నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడే అవకాశాలు తక్కువని తెలుస్తోంది.బ్రహ్మాస్త్ర కూడా షాకివ్వడం ఆ సినిమా అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ బడ్జెట్ సినిమాలు అచ్చిరావడం లేదు.భారీ బడ్జెట్ సినిమాల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ మొత్తంలో నష్టాలు తప్పడం లేదు.

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పుంజుకునే పరిస్థితులు అయితే ఉండవని కామెంట్లు వ్యక్తమతువున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube