ఆముదం( Castor oil ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఆముదాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆరోగ్య పరంగా ఆముదం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.కేశ సంరక్షణకు తోడ్పడుతుంది.
అలాగే ప్రస్తుత చలికాలంలో చర్మానికి కూడా ఆముదం అండగా నిలబడుతుంది.ఆముదంలో చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్ ఈ ( Vitamin E )తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు మెండుగా ఉంటాయి.
మరి ఇంతకీ చర్మానికి ఎన్ని విధాలుగా ఆముదాన్ని వాడొచ్చో తెలుసుకుందాం పదండి.
ప్రస్తుత చలికాలంలో దాదాపు అందర్నీ వేధించే సమస్య డ్రై స్కిన్( Dry skin ).పొడి చర్మాన్ని నివారించడంలో ఆముదం అద్భుతంగా తోడ్పడుతుంది.స్నానం చేయడానికి గంట ముందు ఆముదాన్ని తీసుకుని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేయాలి.ఆముదం చర్మాన్ని తేమగా మారుస్తుంది.మృత కణాలను తొలగిస్తుంది.పొడి చర్మానికి చెక్ పెడుతుంది.

చలికాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు.పగుళ్ల కారణంగా అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.అయితే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని ఆముదాన్ని పాదాలకు అప్లై చేసి మర్దన చేసుకుని సాక్స్ ధరించాలి.రెగ్యులర్ గా ఇలా చేస్తే పగుళ్లు పూర్తిగా మాయమవుతాయి.
పాదాలు మృదువుగా మారతాయి.

పగిలిన పెదాల నివారణకు కూడా ఆముదాన్ని ఉపయోగించవచ్చు.అందుకోసం ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్( Almond oil ) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను రోజుకు రెండు సార్లు చొప్పున పెదాలకు అప్లై చేసుకోవాలి.
ఇలా చేస్తే పగిలిన పెదాలకు కోమలంగా మారతాయి.అందంగా కాంతివంతంగా మెరుస్తాయి.