షావోమి కంపెనీకి చెందిన ఎంఐ 11 లైట్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.దీని కనీస ధర రూ.21,999 గా నిర్ణయించారు.ఈ ఫోన్‌ను మంచి డిస్పే›్లతోపాటు, బ్యాటరీ లైఫ్, కెమెరా లక్ష్యంతో తయారు చేశారు.
అల్ట్రా లైట్ వెయిట్‌తోపాటు, డిజైన్‌ను కూడా స్టిమ్‌గా ఉండి ఆకర్షనియంగా ఉంది.షావోమి ఎంఐ 11లైట్ స్పోర్ట్స్ మోడల్ 6.55 ఇంచ్ 10 బిట్ ఎమోల్డ్ డాట్ డిస్లే్పతో రూపొందించారు.అంతేకాదు దీని రిసోల్యూషన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2400ూ1080 పిక్సెల్స్‌తోపాటు 402 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది.ఈ 2021 సంత్సరంలో ఈ ఫోన్ అత్యంత తక్కువ బరువుతోపాటు, సన్నగా ఉన్న ఫోన్‌ను విడుదల చేసింది ఇదేనట.90 హెట్జ్ గోరిల్లా గ్లాస్, 5 టైమ్స్ ప్రొటెక్షన్‌ను ఇస్తుంది.
డిజైన్ విషయానికి వస్తే
ఈ స్మార్ట్ పోన్ డిజైన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంది.అంతేకాదు బెజిల్‌ఫ్రీ డిౖజñ న్‌తో ఫ్రంట్ కెమెరా, సైడ్ డిజైన్ కర్వ్ షేప్‌లో ఉండనున్నాయట.6.8 ఎంఎం మందంతో దీన్ని రూపొందించారు.ఇందులో మ్యాగ్జిమమ్ స్క్రీన్ సైజ్‌లో ప్రివ్యూ కనిపించడంతోపాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో సున్నితంగా అన్‌లాక్ చేసే అనుభవం కలుగుతుంది.ప్రస్తుతం ఎంఐ 11 లైట్ స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
అవి కోరల్ టస్కేని, జాజ్ బ్లూ, వినైల్ బ్లాక్.
ఈ షావోమి ఫోన్ 732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగ్ చిప్ సెట్‌తో రూపొందించారు.8ఎన్‌ఎం మాన్యూఫాక్చరింగ్ విధానంతో తయారు చేశారు.ఏవైన గేమ్‌లు ఆడేటపుడు ఫోన్ వేడి కాకుండ ఉండేందుకు కూల్ లిక్విడ్ టెక్నాలజీని ఇందులో వాడారని కంపెనీ తెలుపుతోంది.ర్యాం ఎల్‌పీడీడీఆర్4ఎక్స్, యూఎఫ్‌ఎస్ 2.2, ఎంఐయూఐ 12 ఇంటర్‌ఫేస్‌తో తయారైంది.ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం.
ట్రిపుల్ కెమెరా
ఇందులో ట్రిపుల్ కెమెరా ఉంది.64 ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్ 8ఎంపీ, 5ఎంపీ టెల్‌మాక్రో కెమెరా.ఈ 8ఎంపీ కెమెరా ఫోట్ క్యాప్చర్ చేయడానికి సెన్సార్‌గా, 5 ఎంపీ కెమెరాతో అతి చిన్న ఇమెజ్‌లను యూజర్లు క్యాప్చర్ చేయవచ్చు.
ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 ఎంపీ.దీంతో సెల్ఫీలను పగలు, రాత్రి రెండు వేళల్లోనూ చాలా క్లియర్‌గా తీసుకోవచ్చు.అంతేకాదు 4కే వరకు వీడియోలను షూట్ చేయగలిగే ఫీచర్ ఈ ఫోన్‌కు ఉంది.30 ఎఫ్‌పీఎస్ ఆధారంగా నేచురల్‌గా వీడియో రేంజ్ ఉంటుంది.ఇందులో కెమెరా యాప్ ఫీచర్ 23 డైరెక్టర్ మోడ్స్‌తో చాలా రకాల బిల్డ్ ఇన్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.అందులో మ్యాజిక్, జూమ్, ప్యార్లాల్ మొదలైనవి ఉన్నాయి.
ఎంఐ11 లైట్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 4,250 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది.33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో రోజూవారి పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా బ్యాటరీ బ్యాకప్ సహకరిస్తుంది.ఇది మిగతా స్మార్ట్‌ఫోన్ల కంటే చాలా ఎక్కువ బ్యాటరీ సామర్థ్యతో రూపొందించామని షావోమి అంటోంది.ఈ ఫోన్ జూన్ 28 మధ్యాహ్నం 12గంటల నుంచి అన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉండనుంది.ఇందులో ఎంఐ 11 లైట్ 6జీబీ ప్లస్ 128జీబీ రూ.21,999 ధర పలుకుతోంది.8 జీబీ ప్లస్ 128 జీబీ రూ.23,999 గా నిర్ణయించారు.అర్లీ బర్డ్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్లతో మొదటి ఫోన్‌ను కేవలం రూ.18,999, రెండోది రూ.20,999 కి జూన్ 25కే కొనవచ్చు.