సాంబార్( Sambar ).సౌత్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ డిష్ ఇది.
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సాంబార్ ను ఎంతో ఇష్టపడతారు.ఇంట్లో సాంబార్ అంటే మనమంతా ఒక ముద్ద ఎక్కువగానే లాగించేస్తుంటాము.
సాంబార్ మహిమ అలాంటిది.సాంబార్ మన దక్షిణాది వంటకం అని అనుకుంటారు.
కానీ తంజావూరు మరాఠాల వంట గదిలో సాంబార్ మొదట పుట్టింది.రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి కూడా సాంబార్ ఎంతో మేలు చేస్తుంది.
సాంబార్ తో ఆరోగ్య లాభాలా అని తీసి పారేయకండి.
వాస్తవానికి సాంబార్ లో కందిపప్పు, శనగపప్పు ( Kandipappu, Chanagappappu )మరియు అనేక రకాల కూరగాయలు వాడుతుంటారు.
అలాగే సాంబార్ మసాలాను కూడా మన ఇండియన్ స్పైసెస్ తోనే తయారు చేస్తాము.ఇవన్నీ ఆరోగ్యకరమైనవే.అందువల్ల సాంబార్ మనకు అపారమైన హెల్త్ బెనిఫిట్స్ ను చేకూరుస్తుంది.అవేంటో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
సాంబార్ లో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా.ప్రోటీన్, ఫైబర్( Protein , fiber ) వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి సాంబార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాంబార్ తో భోజనం చేస్తే కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది.అదే సమయంలో మెటబాలిజం( Metabolism ) రేటు పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
కాయధాన్యాలు, కూరగాయల సంపూర్ణ కలయికే సాంబార్.అందువల్ల దీన్ని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను అందుతాయి.
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి సాంబార్ ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.సాంబార్ లో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగు పరుస్తుంది.
మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా సాంబార్ ఒక ఆరోగ్యకరమైన ఆహారంగా నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు సాంబార్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అవి మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
వివిధ రకాల వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి.కాబట్టి వారంలో రెండు సార్లు అయినా సాంబార్ ను ఓ పట్టు పెట్టేయండి.
రైస్ తో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ, చపాతీ వంటి ఆహారాలతో కూడా సాంబార్ తీసుకోవచ్చు.