ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్( NTR ) హీరోగా రాబోతున్న కొత్త సినిమాకి సంభందించిన విశేషాలు ఇప్పుడు తెగ హల్చల్ చేస్తున్నాయి.ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తున్నాడు.
ఈ సినిమా మీద అభిమానుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఎందుకంటే కొరటాల శివ ఇంతకుముందు ఆచార్య అనే సినిమాతో ఒక భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో తను ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సలార్ అనే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.దాంతో ఎన్టీఆర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెరిగాయి.ఇక అలాగే ఎన్టీఆర్ తో తీసే సినిమాని ప్రశాంత్ నీల్ సూపర్ హిట్ గా మలిచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి సంబంధించిన ప్రయత్నాల్లో ప్రశాంత్ నీల్ తన పూర్తి ఎఫర్ట్ ని పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ప్రభాస్ కి ( Prabhas ) ఇచ్చినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఒక భారీ రేంజ్ లో సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి ప్రశాంత్ నీల్ సినిమా అంటే హై ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ తో కూడుకొని ఉంటుంది కాబట్టి ఆయన డైరెక్షన్ లో వచ్చే సినిమాలు ఎన్టీఆర్ కి బాగా సెట్ అవుతాయంటూ మరి కొంతమంది వాళ్ళు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నిజానికి ఇలాంటి స్టార్ హీరో దొరికితే ప్రశాంత్ నీల్ ఒక హై అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన సినిమాని ప్లాన్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇలాంటి సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి నటనని పోషిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది…
.