ప్రస్తుత చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
కాబట్టి చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అల్లం లవంగాల టీను( Ginger Clove Tea ) కచ్చితంగా ఖాళీ కడుపుతో తీసుకునేందుకు ప్రయత్నించండి.ఈ టీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, నాలుగు లవంగాలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ టేబుల్ లెమన్ జ్యూస్( Lemon juice ) కలిపితే మన అల్లం లవంగాల టీ సిద్ధం అవుతుంది.చలికాలంలో ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.
ముఖ్యంగా అల్లం లవంగాల టీ మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.అలాగే ఈ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు( Anti-inflammatory properties ) కీళ్ల నొప్పుల ఉపశమనానికి దోహదపడతాయి.ఆర్థరైటిస్ ఉన్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అధిక బరువుతో బాధపడుతున్న వారికి అల్లం లవంగాల టీ ఒక వరం అని చెప్పవచ్చు.
రోజూ ఈ టీను ఉదయాన్నే తీసుకుంటే బాడీలో అదనపు కేలరీలు వేగంగా కరుగుతాయి.ఫలితంగా బరువు తగ్గుతారు.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి కూడా ఈ టీ ప్రసిద్ధి చెందింది.
కాబట్టి మధుమేహం ఉన్నవారు తేనె కలపకుండా ఈ టీను తాగితే ఎంతో మంచిది.పైగా అల్లం లవంగాల టీ జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.