హనుమాన్, శని దేవుడికి మధ్య వైరం ఎందుకు జరిగిందో తెలుసా..?

ఆంజనేయుడిని( Hanuman ) పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని పెద్దవారు, పండితులు చెబుతూ ఉంటారు.

మంగళవారం హనుమాన్ కు ప్రత్యేకం అనుకుంటారు.కానీ అంతకుమించి పవర్ఫుల్ శనివారం.

అయితే శనివారం, శని, హనుమాన్ కి ఏంటి సంబంధం.దీనిపై పురాణాల్లో ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు వానరులు వరాధి నిర్మిస్తారు.ఆంజనేయుడి సారధ్యంలో రాళ్లపై శ్రీరామ అని రాస్తూ నీటిలో వేస్తారు.

ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన శని దేవుడిని చూసి తను కూడా వారాధి నిర్మానంలో సహాయం చేయడానికి వచ్చాడని అందరూ అనుకుంటారు.

"""/" / కానీ హనుమ పై వక్ర దృష్టి ప్రసరించేందుకు వచ్చాడని చెబుతాడు.

అప్పుడు శని( Lord Shani) వెంటనే హనుమాన్ తలపై కూర్చుంటాడు.అయితే వారధి నిర్మాణంలో అడ్డుగా ఉన్నావంటూ స్వామి కార్యం పూర్తయ్యే వరకు తల వదలి కాళ్లు పట్టుకోమని చెబుతాడు.

అలాగే అని శని కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ కాళ్ళ కింద తొక్కి పెట్టేస్తాడు.

పైగా అష్టసిద్ధులు ఉన్న హనుమాన్ ని నెగ్గడం సాధ్యమయ్యే విషయం కాదు.ఆ కాళ్ళ కింద పడిన శని ఇంకెప్పుడు నీ వరకు రాను వదిలిపెట్టమని వేడుకుంటాడు.

ఆ విధంగా శని వక్రదృష్టి నుండి ఆంజనేయుడు తప్పుకోవడంతో పాటు తన భక్తులను కూడా తప్పిస్తాడని అందరి నమ్మకం.

"""/" / కాబట్టి శనివారం రోజు పవనసుతుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు.

అందుకే గ్రహదోషాల నుండి విముక్తి లభించాలంటే హనుమాన్ ని శనివారం రోజున పూజించాలని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండేవారికి శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.

కాబట్టి హనుమంతుడిని కేవలం మంగళవారం నాడు మాత్రమే కాకుండా శనివారం రోజున కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం వలన శని బాధలు తొలగిపోయి మీ జీవితం సంతోషంతో నిండుతుంది.

ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!