టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు చిరంజీవి.
ఇకపోతే ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.దసరా పండుగ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
అంతేకాకుండా ఆచార్య సినిమా చేదు జ్ఞాపకాలను కూడా ఈ సినిమా చెరిపివేసింది అని చెప్పవచ్చు.
కానీ గాడ్ ఫాదర్స్ సినిమా కూడా ఊహించని విధంగా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడ లేక పోయింది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.మెగా అభిమానుల దృష్టి కూడా వాల్తేరు వీరయ్య సినిమా మీదకు మళ్ళింది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమా కంటే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో పాటు ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కథ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతుంది.వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.కథలో రవితేజ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పాత్రలో రవితేజ నటించబోతున్నాడని, రవితేజ మీద ఒక అవినీతి ముద్ర పడి అప్రతిష్టపాలైతే దానిని చెరిపేందుకు చిరంజీవి చేసే ప్రయత్నమే ఈ సినిమా అసలు కథ అంటూ వార్త జోరుగా వినిపిస్తోంది.
ఇందులో చిరంజీవి పాత్రతో పాటు రవితేజ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.రవితేజ పాత్ర ఈ సినిమాల 40 నిమిషాలు ఉండనుందట.