China, rocket : భూమి దిశగా దూసుకొస్తున్న 'చైనా' రాకెట్.. ముప్పు తప్పదా?

రోజురోజుకు చైనా ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది.బయో వార్.

 The 'china' Rocket That Is Heading Towards The Earth.. Is It A Threat China, Roc-TeluguStop.com

కరోనాలతో చైనా ఇప్పటికే మానవళికి తీరని నష్టాన్ని కలిగించింది.కరోనా దెబ్బ యావత్ ప్రపంచం అస్తవ్యస్తం కాగా ఒక్క చైనా మాత్రమే ఆర్థికంగా మరింత బలపడింది.

ఇప్పుడిప్పుడే ఈ మహమ్మరి నుంచి ప్రపంచ దేశాలు క్రమంగా కోలుకుంటున్నాయి.చైనా ఏది చేసిన హాట్ టాఫిక్ అవుతుంది.

ఎందుకంటే చైనా చేసే పనులు అలా ఉంటాయి.ప్రతి దాంట్లో తమ స్థానాన్ని నిలుపుకునేందుకు, తమ ఆధిక్యాన్ని చాటేందుకు చైనా అన్ని రకాలుగా పోటీ పడుతూనే ఉంటుంది.

అలా అందరికీ గట్టి పోటీ ఇవ్వాలనుకునే చైనా ఈ సారి భూప్రపంచానికి ముప్పు తెచ్చి పెట్టింది.మరికొన్ని రోజుల్లో భూమి నాశనం కానుందా? చైనా తియాంగాంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ కూలనుందా? అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ లు తర్జనాభర్జనా పడుతున్నారు.దీంతో మరోసారి చైనా ప్రపంచానికి మరో ముప్పును తెచ్చిపెట్టిందనే వాదనలు విన్పిస్తున్నాయి.ఈసారి లాంగ్ మార్చి 5బీ రాకెట్ రూపంలో రాబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చైనా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని కొన్నాళ్లుగా చేపడుతోంది.

ఇందులో భాగంగా లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ చివరి మాడ్యూల్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు చైనా ప్రకటించింది.

అయితే ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత తిరిగి భూమిపైకి ప్రవేశించనుంది.న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా చైనా 5 బీ రాకెట్ ప్రయోగాలు గత రెండేళ్లలో మూడుసార్లు ప్రవేశపెట్టింది.

అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది.ఈ క్రమంలో ఆదివారం షెన్‌ఝూ-14 స్పేస్‌ షిప్‌ను చైనా ప్రయోగించింది.ఇది ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.వచ్చే ఆరునెలల పాటు వీరు అక్కడే ఉండి అంతరిక్ష కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు.

షెన్‌ఝూ-14 అంతరిక్ష నౌకను లాంగ్‌మార్చ్‌ 2ఎఫ్‌వై14 రాకెట్‌పై ఉంచి ఈశాన్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌ నుంచి ప్రయోగించారు.షెన్‌ఝూ 14లో ఉన్న వారిలో కమాండర్‌ చెన్‌డాంగ్‌, ల్యూ యాంగ్‌, చైషూఝె ఉన్నారు.

వీరిలో చెన్‌ 2016లో నిర్వహించిన షెన్‌ఝూ 11 మిషిన్‌లో పాల్గొన్నారు.చెంగ్డూలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారిని ఈ మిషిన్‌కు ఎంపిక చేసినట్లు చైనా పేర్కొంది.

షెన్‌ఝూ 14లో చిన్న రోబోటిక్‌ చేతులను కూడా అమర్చారు.ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన షెన్‌ఝూ13 మిషిన్‌ సురక్షితంగా భూమికి చేరుకొంది.

ఈ మిషిన్‌లో చైనా స్పేస్‌ స్టేషన్‌ టెక్నాలజీ వెరిఫికేషన్‌ను పూర్తి చేశారు.

Telugu China, China Tiangong, Earth, Long March, Pang Wu, Rocket-Telugu NRI

గత సోమవారం ప్రయోగించిన రాకెట్ నాలుగోది కావడం విశేషం.ఇంతకముందు సైతం చైనా ప్రయోగించిన రాకెట్లు భూ కక్ష్యలోకి వచ్చి మండిపోయాయి.అయితే గతేడాది లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు ఎలాంటి నియంత్రణ లేకుండానే భూ వాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కుప్పకూలాయి.

ఈయొఇద‌తే చైనా తియాంగాంగ్‌-1 చాలా రోజుల క్రితమే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది.అప్పటినుంచి అది ఆకాశంలో అటు ఇటు పరిభ్రమిస్తూ ఉంది.ప్రస్తుతం ఇది భూకక్ష్యలోకి వచ్చి భూమివైపు తన ప్రయాణం సాగిస్తోంది.ఎప్పుడో అప్పుడు మాత్రం ఇది కూలడం ఖాయం అని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

ఇక ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్ శకలాలు మలేసియా ఇండోనేషియా సమీపంలోని ఓ ద్వీపం లో.ఫిలిప్పీన్స్ సమీపంలోని సముద్రంలో పడిపోయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఇక ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రాకెట్ శకలాలు మలేసియా ఇండోనేషియా సమీపంలోని ఓ ద్వీపం లో.ఫిలిప్పీన్స్ సమీపంలోని సముద్రంలో పడిపోయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.కాగా ఈసారి కూడా లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ భూ కక్ష్య లోకి వెళ్లి తిరిగి భూమి పైకి రానుంది.ఇందుకు సంబంధించి 28 గంటల రీ ఎంట్రీ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు కొనసాగనుంది.

సుమారు పది అంతస్థుల ఎత్తైన భవనం ఆకారంలో ఉండే ఈ రాకెట్ లోని కొంత భాగం భూ వాతావరణంలోకి తిరిగి వచ్చే సమయంలో దీనిలో కొన్ని భాగాలు మండిపోయే అవకాశం ఉంది.వీటి శకలాలు భూమిపై ఎక్కడ పడుతాయనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఏరోస్పేస్ కార్పొరేషన్ పేర్కొనడం ఆందోళనను కలిగిస్తోంది.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.సముద్రాలు.ఖాళీ ప్రదేశాల్లో ఈ రాకెట్ శకలాలు పడే అవకాశం ఉంది.అలా కాకుండా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ రాకెట్ శకలాలు పడితే మాత్రం పెను ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు చైనా రీ ఎంట్రీ కౌంట్ డౌన్ ప్రారంభించడంతో అందరి దృష్టి లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ ప్రయోగం పైనే నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube