బుల్లితెర ఆర్టిస్ట్ అరియానా బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా ప్రియులకు బాగా పరిచయం.ఈమె తన కెరీర్ ను యాంకర్ గా ప్రారంభించింది.
అలా ఓసారి టాలీవుడ్ కాంట్రవర్సరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిలో పడింది.దీంతో ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం కూడా వచ్చింది.
ఇక బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.
యాంకర్ గా కొనసాగుతూనే పలు షో లలో కూడా ఆర్టిస్టుగా చేస్తుంది.
ప్రస్తుతం బీబీ జోడీలో డాన్సర్ గా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.
బిగ్బాస్ తర్వాత ఈమెకు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర సీరియల్ నటులు కూడా ఫ్రెండ్స్ అయ్యారు.సమయం దొరికితే వాళ్ళతో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటుంది.
అందులో సీరియల్ నటుడు అమరదీప్, అషు రెడ్డి మరి కొంతమందితో బాగా క్లోజ్ గా ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే అరియానా కు డాన్స్ రాదన్న సంగతి అందరికీ తెలిసిందే.వచ్చిరాని స్టెప్పులతో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా డాన్స్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.దీంతో ఈమెకు డాన్స్ పట్ల ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.
ఇక తాజాగా తన ఫ్రెండ్ అమరదీప్ కూడా తన డాన్స్ పై ట్రోల్ చేశాడు.
జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి గురించి అందరికీ పరిచయమే.
ఆ సీరియల్ లో రామచంద్ర పాత్రలో నటించి మంచి అభిమానం సంపాదించుకున్నాడు.మొదట్లో ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు.
అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.అలా ప్రేక్షకులలో మంచి అభిమానం సంపాదించుకున్నాడు.

ఇక ఇటీవలే ఈయన మరో బుల్లితెర నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక వీరి పెళ్లికి అరియానా కూడా వెళ్లి బాగా సందడి చేసింది.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటాడు.తన ఫ్రెండ్స్ కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటాడు.
అయితే తాజాగా తను ఒక ఫన్నీ వీడియో షేర్ చేసి అరియానా ను ట్యాగ్ చేశాడు.
ఆ వీడియోలో ఒక కోతి ఒక స్టిక్ సపోర్టుతో దాని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తున్నట్లుగా కనిపించింది.అయితే ఆ వీడియోను షేర్ చేస్తూ.ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేసింది రా నీలాగా అంటూ అరియానా ను ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు.దీంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకున్నారు.
అంతేకాకుండా అరియానా డాన్స్ కూడా ఇలాగే ఉంటుంది అంటూ మరోసారి ట్రోల్ చేశారు.మరి ఈ ట్రోల్ కి అరియానా ఏమని స్పందిస్తుందో చూడాలి.