ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్( Hyderabad ) మహానగరంగా ఎంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి.ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ అభివృద్ధిని చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాదులో మరో అంతర్జాతీయ సంస్థ ( International organization )రానుంది.
హైదరాబాదు నగరంలో వారి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ఆక్యుజెన్ సంస్థ( Accugen company ) ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( KTR ) తో ఆక్యుజెన్ ప్రతినిధులు సమావేశం అయిన సమయంలో ఈ విషయం ప్రకటించటం జరిగింది.ఈ ప్రకటనపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆక్యుజెన్ పరిశోధన కేంద్రం లైవ్ సైన్సెస్ రంగంలో కీలకమవుతుందని పేర్కొన్నారు.లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.250 బిలియన్ డాలర్ల సాధనలో ఆక్యుజెన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది.