నాన్నని మద్యం మాన్పించాలి కొడుకు “ఆత్మహత్య”..

ఒక కుర్రాడు తన తండ్రిని మద్యం బానిసత్వం నుంచీ బయటకి తీసుకురావాలని ప్రయత్నించాడు.చివరకి ఏమి చేయాలో తెలియక తనువు చాలించాడు.

 Son Suicide For Father-TeluguStop.com

తన చావుతో అయినా సరే తన తండ్రి మద్యం మానేస్తాడు అని ఓ పిచ్చి ఆలోచన తన ఎన్నో ఏళ్ల భవిష్యత్తు కలని చిద్రం చేసింది ఆ కుర్రవాడు రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.వివరాలలోకి వెళ్తే.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్‌ కుమారుడు ఉన్నాడు అతని పేరు దినేశ్‌ నల్లశివన్‌ (17).ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతున్నాడు.9ఏళ్ల క్రితమే తల్లి మరణించడంతో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి.తండ్రి తాగుడుకు బానిసయ్యాడు.

రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం మాడసామికి నిత్యకృత్యం అయిపోయింది…ఈ క్రమంలోనే

తన తండ్రి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికీ తన తండ్రి వ్యవహారంలో మార్పు రాలేదు తన అప్పటికే తన తల్లిని కోల్పోయిన దినేశ్ తండ్రి ఇలా అయిపోవడం భరించలేక పోయాడు ఎలా అయినా సరే తాగుడు కి తన తండ్రిని దూరం చేయాలని అనుకున్నాడు ఒక లేఖని రాసి ఆత్మహత్యకి పాల్పడ్డాడు.ఇప్పుడు అతడు రాసిన లేఖ అందరిని కంటతడి పెట్టిస్తోంది.

ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్ష కోసం సిద్దమవుతు భవిష్యత్తు కోసం ఎంతో పరితపించే దినేశ్ రాసిన లేఖ గుండెల్ని పిండేస్తోంది.“ నాన్నా.

నా చావుతోనైనా నువ్వు మారతావనుకుంటున్నాను.ఇకనుంచైనా తాగుడు మానెయ్‌.

కనీసం నా శవానికి తలకొరివి పెట్టేందుకైనా నువ్వు మద్యం తాగకుండా వస్తావనుకుంటున్నా.అయినా తాగకుండాఉండలేను అంటే…నువ్వు మాత్రం దయుంచి నా అంత్యక్రియలకు రాకు.

అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది’ అంటూ దినేశ్ లేఖలో రాశాడు.

దినేశ్ అక్కడితో ఆగలేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మద్యం షాపులను మూసేయాలని దినేశ్ విజ్ఞప్తి చేశాడు.

ఇకనైనా తమిళనాడులో మద్యం షాపులను మూసేయకపోతే నా ఆత్మనే వాటిని ధ్వంసం చేస్తుందని దినేశ్ లేఖలో పేర్కొనడం గమనార్హం…ఇప్పుడు దినేశ్ రాసిన లేఖ తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube