స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి త్వరగా కోలుకుని మునుపటిలా యాక్టివ్ గా ఉండాలని మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ నెల నుంచి విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఖుషి సినిమా షూట్ లో సమంత పాల్గొననున్నారు.
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లలో కచ్చితంగా నటించేలా సమంత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఫిబ్రవరి నెల 17వ తేదీన సమంత నటించిన శాకుంతలం మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
సమంతపై మార్కెట్ ను మించి గుణశేఖర్ ఈ సినిమా కోసం ఖర్చు చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.అయితే తాజాగా సమంత మాట్లాడుతూ జీవితం అంతకు ముందులా లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ సమంత ఈ కామెంట్లు చేశారు.
విమర్శలు తిప్పికొట్టాలని ఒక నెటిజన్ సూచించగా అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు చాలా అవసరమని ఇంతకీ ఆ విమర్శలు ఏంటని సమంత రివర్స్ లో ప్రశ్నించారు.తాను శాకుంతలం సినిమాను అంగీకరించడానికి కారణమేంటో ఈ సినిమా చూశాక మీకే తెలుస్తుందని మరో నెటిజన్ ప్రశ్నకు సమంత ఘాటుగా బదులిచ్చారు.ప్రస్తుతం శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
యశోద సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా ఆ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయింది.కథల ఎంపికలో సమంత జడ్జిమెంట్ రైటేనని యశోద మూవీ ప్రూవ్ చేసింది.శాకుంతలం కూడా సక్సెస్ సాధిస్తే నయనతార స్థాయిలో సమంత గుర్తింపును సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.శాకుంతలం త్రీడీలో కూడా థియేటర్లలో రిలీజ్ కానుందని బోగట్టా.