గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.కిసాన్ క్రెడిట్ కార్డు పేరుతో కొందరు కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో ఐడీబీఐ బ్యాంకు నుంచి ముఠా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.గుంటూరు ఐడీబీఐ బ్యాంకు నుంచి 247 మంది రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారని సమాచారం.
దీంతో రంగంలోకి దిగిన ఈడీ నలుగురికి చెందిన ఆస్తుల్ని అటాచ్ చేసింది.ఈ మేరకు రూ.20 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.







