సీనియర్ సినీ నటుడు శరత్ బాబు(Sarath Babu) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.శరత్ బాబు మరణించడంతో ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.
శరత్ బాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఈయన కంటూ వారసులు లేకపోవడంతో ఈయన సంపాదించిన కొన్ని వందల కోట్ల ఆస్తి తన సోదరీ సోదరుల పిల్లలకు చందేలా వీలునామా రాసారని తెలుస్తోంది.అయితే శరత్ బాబు మరణించిన తర్వాత తాజాగా ఆయన డైరీ బయటపడడంతో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

శరత్ బాబు గారికి ప్రతిరోజు డైరీ (Dairy)రాసే అలవాటు ఉంది.ఆయన తన సినీ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను కష్టాలన్నీటిని కూడా డైరీలోనే రాసేవారట.అయితే శరత్ బాబు మరణించిన తర్వాత ఆయన డైరీ బయటపడటంతో శరత్ బాబు తన శేష జీవితం గురించి ఎన్నో విషయాలను డైరీలో రాశారని తెలుస్తుంది.ఎన్నో సినిమాలలో నటించి ఎంతో ఆస్తులను సంపాదించిన శరత్ బాబు ఆస్తి( Sarath Babu Properties ) మొత్తం తన సోదరీ సోదరుల పిల్లలకు చెందాలని వీలునామా రాయడమే కాకుండా తన శేష జీవితం గురించి కూడా డైరీలో రాసినట్టు తెలుస్తుంది.

శరత్ బాబు తన శేష జీవితాన్ని హార్సిలీ హిల్స్ లో గడపాలని డైరీలో రాశారని తెలుస్తోంది.పచ్చని ప్రకృతిల నడుమ తన జీవితం గడిచిపోయే విధంగా శరత్ బాబు తన చివరి రోజులను ప్లాన్ చేసుకున్నారని సమాచారం.అయితే అక్కడ ఇల్లు నిర్మాణం చేపడుతున్న సమయంలోనే శరత్ బాబు అనారోగ్యానికి గురై ఇలా మరణించారని తెలుస్తోంది.అయితే ఇదే శరత్ బాబు చివరి కోరికగా ఆ కోరిక నెరవేరకుండానే శరత్ బాబు మరణించారని తెలిసి అందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.