ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో....?

బీహార్లో రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతున్నది.భాజపా నాయకత్వంలోని ఎన్డీయే ఒకటి.

 Bjp Will Decide Chief Ministerial Candidate After Polls-TeluguStop.com

లాలూ పార్టీ ఆర్జేడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, సోనియా కాంగ్రెస్ కలిసి ఏర్పడిన గ్రాండ్ అలయన్సు ఇంకోటి.గ్రాండ్ అలయన్సు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ఎప్పుడో నిర్ణయం అయ్యారు.

ఎన్డీయే నిర్ణయించలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తీ మెజారిటీ సాధించిన తరువాత ముఖ్యమంత్రి ఎవరో ప్రకటిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

విజయం సాధించాక పార్టీ, పార్లమెంటరీ బోర్డు కలిసి సీఎమ్ అభ్యర్థిని నిర్ణయిస్తాయని చెప్పారు.బీహార్ ప్రజలు తమతోనే ఉన్నారని అమిత్ ధీమా వ్యక్తం చేసారు.

ప్రజలు మరోసారి ఆటవిక పరిపాలన్ కోరుకోవడం లేదన్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోడీని ముందుగానే ప్రకటించిన బీజేపీ బీహార్లో భయపడుతోంది.

సీఎమ్ అభ్యర్థిని ప్రకటించాక గెలవకపోతే పరువు పోతుందని భావిస్తున్నట్లుగా ఉంది.తాము అధికారంలోకి వస్తామనే ధీమా గ్రాండ్ అలయన్సుకు ఉన్నందునే అది నితీష్ కుమార్ పేరును ముందుగా ప్రకటించింది.

నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినా అధికారం లాలూ ప్రసాద్ చేతిలోనే ఉంటుందని, రిమోట్ తన చేతిలోనే పెట్టుకుంటారని బీజేపీ ప్రచారం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube