మరోమారు సాధువును దర్శించుకున్న కోహ్లీ దంపతులు.. (వీడియో)

దేశంలోనే అనేక మంది ప్రముఖులు తరచుగా బృందావనంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ని( Premanand Govind Sharan Maharaj ) దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు.ఈ క్రమంలో గత కొన్నాలుగా విరాట్ కోహ్లీ,( Virat Kohli ) అనుష్క శర్మ( Anushka Sharma ) ఇద్దరూ కలిసి మతపరమైన యాత్రలు చేపట్టారు.

 Anushka Virat Kohli Seek Blessings From Guru Premanand Maharaj Details, Anushka-TeluguStop.com

ఇందులో భాగంగానే వారి ఇద్దరూ గతంలో సాధువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ను కలవడం కోసం బాబా నీమ్ కరౌలీ కైంచి ధామ్ కు వెళ్లారు.అయితే, తాజాగా విరాట్ అనుష్క ఇద్దరుతో పాటు పిల్లలిద్దరితో కలిసి మరోమారు ప్రేమానన్ మహారాజ్ ను కలిసి ఆశ్రీవాదం తీసుకున్నారు.

విరాట్, అనుష్క ఇద్దరు పిల్లలతో కలిసి మహారాజు వద్దకు వెళ్లి పాదాభివందనం చేసే ఆశీర్వాదాలు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.గతంలో విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో బాధపడుతున్నప్పుడు స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ.ఇక వీరు సాధువును కలిసిన సందర్భంగా విరాట్ అనుష్కల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా అతనితో అనుష్క మాట్లాడుతూ.‘చివరిసారి మేము వచ్చినప్పుడు నా మనస్సులో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి.ఇప్పుడు అవి అడగాలని అనుకున్నాను.

కానీ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అదే ప్రశ్న అడిగారని కోహ్లీ అన్నాడు.కాబట్టి, మీరు నాకు ప్రేమ, భక్తిని మాత్రమే ప్రసాదించండి కోరినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లేమితో సతమవుతున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కోల్పోయి అభిమానులను నిరాశపరిచాడు.ఐదు మ్యాచుల్లో కేవలం 190 పరుగులే సాధించగా.అందులో ఒకే ఒక్క సెంచరీ మాత్రమే చేయగలిగాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube