టీనేజ్ ప్రారంభమైందంటే చాలు మొట్ట మొదట ఇబ్బంది పెట్టేవి మొటిమలే.హార్మోన్ ఛేంజస్, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల మొటిమలు వస్తుంటాయి.
కారణం ఏదైనా మొటిమలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసి మానసికంగా కృంగదీస్తాయి.ఈ క్రమంలోనే వాటిని వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
వేలకు వేలు డబ్బు తగలేస్తుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం రెండు రోజుల్లో బిర్యానీ ఆకుతో మొటిమలను తగ్గించుకోవచ్చు.
అవును, బిర్యానీ ఆకులో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు మొటిమలను సమర్థవంతంగా నివారించగలవు.మరి ఇంతకీ బిర్యానీ ఆకును చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు నుంచి ఆరు బిర్యానీ ఆకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో స్మూత్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గనుక.కేవలం రెండు రోజుల్లోనే మొటిమలు తగ్గు ముఖం పడతాయి.అలాగే మొటిమల వల్ల మచ్చలు సైతం పడకుండా ఉంటాయి.
కాబట్టి, మొటిమలు వచ్చినప్పుడు సతమతం అయిపోతూ మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములు, మాస్కులు వాడటం కంటే.ఇంట్లో ఉండే బిర్యానీ ఆకుతో పైన చెప్పిన విధంగా చేయండి.తద్వారా మొటిమలను సులభంగా మరియు వేగంగా తగ్గుతాయి.పైగా ఈ రెమెడీ వల్ల ఎటువంటి సౌడ్ ఎఫెక్ట్స్ ఉండవు.